Begin typing your search above and press return to search.

బెట్టింగ్ యాప్ కేసు.. విచారణకు హాజరైన రానా

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భాగంగా ఇవాళ విచారణకు హాజరయ్యారు.

By:  M Prashanth   |   15 Nov 2025 6:48 PM IST
బెట్టింగ్ యాప్ కేసు.. విచారణకు హాజరైన రానా
X

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భాగంగా ఇవాళ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌ సీఐడీ కార్యాలయంలో సిట్‌ అధికారుల ఎదుట రానా నేడు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌ లకు ప్రచారం చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. అందులో భాగంగానే నేడు రానాను విచారించింది. అయితే విచారణ అనంతరం నటుడు రానా మీడియాతో మాట్లాడారు.

రానా విచారణ దాదాపు గంటన్నరసేపు జరిగింది. ఈ క్రమంలో తాను చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతనే ఫలానా యాప్ కు ప్రచారం చేశానని రానా అధికారులకు తెలిపారు. తాను స్కిల్ కు సంబంధించిన గేమింగ్ యాప్ లనే ప్రమోట్ చేశానని.. అన్ని కంప్లీట్ గా పరిశీలించిన తర్వాతే సదరు సంస్థలతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు రానా వివరించారు. రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్న ఏ సంస్థతోనూ ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఈ వ్యవహారంపై తన న్యాయ బృందం కూడా విచారణ చేసిందని రానా చెప్పారు. అలాగే సీఐడీ అధికారులకు సంబంధింత వివరాలు కూడా అందజేశానని అన్నారు. ఇక గేమింగ్, బెట్టింగ్ యాప్స్ గురించి సరైన మెసేజ్ ను ప్రజల్లోకి చేరవేసేందుకు సరైన విధానాలు అనుసరిస్తామని రానా అన్నారు. అలాగే ఈ క్యాంపెయిన్ ను ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసేందుకు తన వంతుగా చేసేందుకు సిద్ధంగా ఉన్నాని పేర్కొన్నారు.

అయితే డబ్బులతో లింక్ ఉన్న బెట్టింగ్‌, గేమింగ్ యాప్‌ ల భరతం పట్టేందుకు ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఈ గేమింగ్ యాప్ లకు బానిసై అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఈ సిట్ ను సీఐడీ పర్యవేక్షిస్తుంది. అయితే గతంలో ఇలాంటి బెట్టింగ్ యాప్ లకు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు.

యాంకర్, నటి విష్ణు ప్రియ కూడా ఈ రోజే విచారణకు హాజరైంది. ఇక రీసెంట్ గా ప్రకాశ్ రాజ్ అధికారుల ఎదుట హాజరై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వీళ్లతోపాటు ఇటీవలే హీరో విజయ్‌ దేవరకొండతో పాటు సినీ మంచు లక్ష్మి, సిరి హన్మంత్, సుప్రియా సహా మరికొంత మంది నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను అధికారులు విచారణ చేశారు.