Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి నెక్స్ట్.. మరో బిగ్ ట్విస్ట్!

టాలీవుడ్‌లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు.

By:  M Prashanth   |   30 Jan 2026 3:33 PM IST
అనిల్ రావిపూడి నెక్స్ట్.. మరో బిగ్ ట్విస్ట్!
X

టాలీవుడ్‌లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు. గత ఏడాది సంక్రాంతికి వెంకటేష్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్, ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. వరుసగా ఇద్దరు సీనియర్ హీరోలకు సాలిడ్ సక్సెస్ ఇవ్వడంతో అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోందనే చర్చ ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతోంది.

​సాధారణంగా అనిల్ రావిపూడి తన సినిమాల్లో కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా ఉండేలా చూసుకుంటారు. అయితే ఈసారి అనిల్ తన పంథా మార్చి ఒక డిఫరెంట్ అప్రోచ్ తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మూవీ హీరో ఎవరనేది ఇప్పటి వరకు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా, విక్టరీ వెంకటేష్ తోనే అనిల్ మరో సినిమా చేయబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి కాబట్టి, ఈ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

​ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ లీక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో వెంకటేష్‌ను ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్‌ను అనిల్ రావిపూడి లాక్ చేసినట్లు సమాచారం. ఫాహద్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, 'పుష్ప' సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ గా ఆయన చూపించిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. ఇప్పుడు అనిల్ మార్క్ కమర్షియల్ డ్రామాలో వెంకీకి ఆపోజిట్ గా ఫాహద్ కనిపిస్తే ఆ గొడవ వేరే లెవల్ లో ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.

​అనిల్ రావిపూడి రీసెంట్ గా ఫాహద్ ఫాసిల్‌ను కలిసి కథ వినిపించారని, ఆ క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ నచ్చి ఆయన వెంటనే ఓకే చెప్పారని టాక్. సాధారణంగా అనిల్ సినిమాల్లో విలన్ పాత్రలు కూడా కాస్త ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. కానీ ఈసారి వెంకటేష్ కోసం ఒక సీరియస్ క్రైమ్ లేదా ఇంటెన్స్ డ్రామాను అనిల్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఫాహద్ లాంటి వెర్సటైల్ నటుడు ఉంటేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని అనిల్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది.

​వెంకటేష్ ఇప్పటికే 'ఆదర్శ కుటుంబం' సినిమా పనుల్లో బిజీగా ఉండగా, ఆ గ్యాప్ లోనే అనిల్ ఈ స్క్రిప్ట్ పనులు పూర్తి చేసినట్లు సమాచారం. ఇది మల్టీస్టారర్ కాదని, కేవలం వెంకటేష్ లీడ్ రోల్ లో సాగే స్టాండలోన్ సినిమా అని ఇన్ సైడ్ రిపోర్ట్. పక్కా లోకల్ నేటివిటీతో సాగే ఈ కథలో ఫాహద్ ఫాసిల్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని బజ్ వినిపిస్తోంది. ​ఇక అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో బాక్సాఫీస్ దగ్గర మరో పెద్ద బాంబు పేల్చేలా కనిపిస్తున్నారు. వెంకటేష్ ఫాహద్ ఫాసిల్ కాంబినేషన్ పై వస్తున్న ఈ లీక్స్ నిజమైతే గనుక అది టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాస్టింగ్ అవుతుంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అనిల్ అఫీషియల్ గా ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.