అన్నదమ్ములిద్దరు ఒకేసారి భాజాలా!
పెళ్లిళ్ల సీజన్ మరో నెల రోజుల్లో ముగుస్తుంది. అటుపై వచ్చే కార్తీక మాసంలో పెళ్లిళ్లు ఉన్నా? ఆ సీజన్ లో చాలా తక్కువగానే పెళ్లిళ్లు జరుగుతుంటాయి.
By: Srikanth Kontham | 27 Sept 2025 3:00 PM ISTపెళ్లిళ్ల సీజన్ మరో నెల రోజుల్లో ముగుస్తుంది. అటుపై వచ్చే కార్తీక మాసంలో పెళ్లిళ్లు ఉన్నా? ఆ సీజన్ లో చాలా తక్కువగానే పెళ్లిళ్లు జరుగుతుంటాయి. మళ్లీ మార్చి వరకూ మంచి ముహూర్తాలు లేవు. మరి ఈసారి వచ్చే వేసవిలో టాలీవుడ్ లో భాజాలు మ్రోగేది ఎంత మందికి? అంటే అందరి సంగతి ఏమోగానీ.. ఓ పెద్ద కుటుంబ నుంచి మాత్రం భాజాలు మోగడం ఖాయంగా కనిపిస్తోంది. వారిద్దరు అన్నదమ్ములు కావడం విశేషం. ఇప్పటికే ఓ హీరో వయసు 38 కాగా, మరో నటుడి వయసు 30. ఈ నేపథ్యంలో ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేయాలి అన్న ఆలోచనలో కుటుంబ సభ్యు లున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది.
అమెరికా-ఆస్ట్రేలియాలో ఉన్నారా:
ఇప్పటికే పిల్లను వెతికే పనిలో పడ్డట్లు సమాచారం. ఇరువురికి ఎలాంటి లవ్ లు లేవకపోవడంతో పిల్లను వెతికే బాధ్యత పెద్దలే తీసుకున్నారు. ప్రముఖంగా ఇంటి పెద్దాయనే సీరియస్ గా సంబంధాలు చూస్తున్నారట. బయట సంబంధాలు కంటే? బాగా తెలిసిన వారి కుటుంబం నుంచి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించి వారినే అడుగుతున్నారుట. అలా ఇప్పటికే ఓ రెండు కుటుంబాలను టచ్ చేయగా వారి నుంచి పాజిటివ్ గానే స్పందన వచ్చిందట. ఇద్దరు వేర్వేరు కుటుంబాలకు చెందిన వారు అట. పిల్లలిద్దరిలో ఒకరు యూఎస్ లో...మరోకరు ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు అభ్యసించిన వారేనట.
క్రమశిక్షణ కలిగిని నటులు:
ప్రస్తుతం అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారట. వివాహం తర్వాత ఇండియాలోనే స్థిరపడాలనే ఆలోచనలో ఉన్నారుట. ఈ సమాచారం అంతా ముందే సేకరించి కుటుంబ సభ్యులు పిల్లను ఇచ్చే పెద్దలకు టచ్ లోకి వెళ్లినట్లు వినిపిస్తోంది. అన్నదమ్ములిద్దరు పెద్దలు మాట జవదాటని వారే. చిన్న నాటి నుంచి ఎంతో క్రమ శిక్షణతో పెరిగిన వారు. బాగానే చదువుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్నారు. సినిమాల్లో రాకకు కూడా పెద్దాయన ఎంతో సహకరించ డంతోనే సాధ్యమైంది.
వారిద్దరి పెళ్లికి వేళాయనే:
చిన్నప్పటి నుంచి కొన్ని రకాల బాధ్యతలు ఆ పెద్దాయన తీసుకోవడంతో? పెళ్లి బాధ్యత కూడా తానై తీసుకుం టున్న ట్లు తెలుస్తోంది. మిగతా అన్నదమ్ములు కూడా మేనల్లుళ్ల విషయంలో అంతే బాధ్యతగా ఉంటారు. పెద్దల పట్ల వారు అంతే విధేయతతో ఉంటారు. సమయం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ మామల గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు. అలాంటి మామలు తెచ్చిన పిల్లను కాకపోతే ఇంకెర్ని చేసుకుంటారు. 2026లో పెళ్లి భాజాలు మోగించడమే ఆలస్యం.
