Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ సెకండ్ హాఫ్ జోరు!

మరోవైపు కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన `మా ఇంటి బంగారం` చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో సంచలనంగా నిలిచింది.

By:  Srikanth Kontham   |   30 July 2026 1:34 PM IST
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ సెకండ్ హాఫ్ జోరు!
X

టాలీవుడ్ బాక్సాఫీస్ ప్రయాణం ఏడాది ఆరంభంలో నిరాశలతో ప్రారంభ‌మైనా? ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా సరికొత్త జోరును ప్రదర్శిస్తోంది. ఏడాది మొదటి అర్ధభాగంలో (ఫస్ట్ హాఫ్) ప్రేక్షకుల ఆశించిన స్థాయి బ్లాక్‌బస్టర్ హిట్లు పడకపోయినా? ద్వితీయార్ధం (సెకండ్ హాఫ్) ప్రారంభమైందో టాలీవుడ్ బాక్సాఫీస్ రూపురేఖలే మారిపోతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో గుడ్ టైమ్ నడుస్తోందని.. కలెక్షన్ల వర్షం కురుస్తోందని ట్రేడ్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ థియేటర్లకు బ్రహ్మరథం పడతారనే సత్యాన్ని సెకండ్ హాఫ్ మరోసారి నిరూపించింది.

బాక్సాఫీస్ పునరుజ్జీవనంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చిత్రాలలో `చెన్నై లవ్ స్టోరీ` ఒకటి. ట్రెండీ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా సైలెంట్‌గా బాక్సాఫీస్ బరిలోకి దిగిన సినిమా మౌత్ టాక్‌తో కలెక్షన్లను పెంచుకుంటూ దూసుకుపోతోంది. వైవిధ్యమైన ప్రేమకథలను ఇష్టపడే మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఈ సినిమాకు క్యూ కట్టడంతో థియేటర్ల వద్ద సందడి మళ్లీ మొదలైంది.

వీటితో పాటు పొలిటికల్ .. మాస్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన `లెనిన్` సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. పవర్‌ఫుల్ డైలాగులు, గ్రిప్పింగ్ నరేషన్‌తో సాగే చిత్రం మాస్ ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పిం చడంలో విజయవంతమైంది. హీరో క్యారెక్టరైజేషన్ ..ఎలివేషన్ సీన్లు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఫస్ట్ హాఫ్‌లో సరైన హిట్లు లేక డీలా పడిన డిస్ట్రిబ్యూటర్లకు..ఎగ్జిబిటర్లకు `లెనిన్` చిత్రం మంచి ఊరటనిస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది.

మరోవైపు కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన `మా ఇంటి బంగారం` చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో సంచలనంగా నిలిచింది. పండుగ వాతావరణాన్ని తలపించే సెంటిమెంట్, వినోదం , కుటుంబ బంధాల నేపధ్యం ఉన్న సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుమైన స్పందన లభిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తుండటంతో సినిమా హౌస్‌ఫుల్ బోర్డులతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

ఈ సినిమాల విజయం టాలీవుడ్‌కు మంచి ఉత్సాహాన్ని అందించింది. స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా బలమైన కంటెంట్ , సరికొత్త కథలతో తెరకెక్కుతున్న మీడియం రేంజ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయగలవో సెకండ్ హాఫ్ రుజువు చేసింది. ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు ఇది మంచి పరిణామం అని చెప్పొచ్చు. ప్రేక్షకుల నాడిని పట్టుకుని సరైన సమయంలో సినిమాలను విడుదల చేస్తే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయమని మ‌రోసారి నిరూపితమైంది.

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొదటి అర్ధభాగంలో ఉన్న డీలా పడిన వాతావరణాన్ని సెకండ్ హాఫ్ పూర్తిగా మార్చివేసింది. `చెన్నై లవ్ స్టోరీ`, `లెనిన్`, `మా ఇంటి బంగారం` వంటి వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ జోరును పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. రాబోయే రోజుల్లో ఈ జోరు మరింత కొనసాగి టాలీవుడ్ ఇండస్ట్రీకి మరిన్ని భారీ విజయాలు దక్కుతాయని ఆశిద్దాం.