Begin typing your search above and press return to search.

బ‌హుమ‌తుల‌కు..ఫేక్ క‌లెక్ష‌న్ల‌కు చెల్లు చీటు!

కొన్ని కేసెస్ లో నిర్మాత ఇన్వాల్వ్ మెంట్ ఉన్నా? అత‌డు పూర్తి స్థాయిలో బాధ్య‌త వహించ‌డ‌న్నారు. భ‌విష్య‌త్ లో ఇలాంటి పోస్ట‌ర్ల‌కు అవ‌కాశం ఉండ‌క పోవ‌చ్చు అన్నారు.

By:  Srikanth Kontham   |   20 Jan 2026 8:30 AM IST
బ‌హుమ‌తుల‌కు..ఫేక్ క‌లెక్ష‌న్ల‌కు చెల్లు చీటు!
X

సినిమాకు నెగిటివ్ టాక్ వ‌చ్చినా? మా సినిమా వంద‌ల‌కోట్లు క‌లెక్ట్ చేసిందంటూ సినిమా రిలీజ్ అయిన రెండు..మూడు రోజుల‌కే క‌లెక్ష‌న్ల పోస్ట‌ర్లు రిలీజ్ చేయ‌డం టాలీవుడ్ లో క‌నిపిస్తుంటుంది. స్టార్ హీరోల సినిమా విష‌యంలో ఈ హైప్ ఏమాత్రం త‌గ్గ‌దు. తొలి షోతో సినిమాకు నెగిటిట్ టాక్ వ‌చ్చినా? థియేట‌ర్ వ‌ద్ద ప‌బ్లిక్ టాక్ నెగిటివ్ గా వ‌చ్చినా? వాటితో సంబంధం లేకుండా కలెక్ష‌న్ల పోస్ట‌ర్ల‌ను నిర్మాత‌లు రిలీజ్ చేస్తుంటారు. సినిమా కు హిట్ టాక్ వ‌చ్చినా? ఇలాంటి పోస్ట‌ర్లు క‌నిపిస్తుంటాయి. అవి చూసిన‌ప్పుడ‌ల్లా నిజంగా ఆ సినిమా అంత వ‌సూల్ చేసిందా? అని చూసి ప్రేక్ష‌కులు నోరెళ్ల‌బెడ‌తారు.

ఇందులో వాస్త‌వం ఎంత అంటే? అదంతా ఫేక్ అని ఆ మ‌ధ్య ఓ నిర్మాత ప‌బ్లిక్ గానే చెప్పాడు. ఏదో ప్ర‌చారం కోసం చేయ‌డం త‌ప్ప అన్ని కోట్లు వ‌సూళ్లు సాధిస్తే నిర్మాత‌లు అప్పులెందుకు చేస్తారంటూ స‌మాధానం ఇచ్చాడు ఓ నిర్మాత‌. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అలాంటి పోస్ట‌ర్లు వేస్తుంటారని ఆ నిర్మాత అభిప్రాయ‌ప‌డ్డారు. తాజాగా మ‌రో స్టార్ ప్రొడ్యూస్ కూడా ఆ నిర్మాత వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌వించారు. ఇదంతా అన‌వ‌స‌ర‌మైన ప్రచారం త‌ప్ప రూపాయి ఉప‌యోగం ఉండ‌ద‌న్నారు. వీటితో నిర్మాత సాధించేది ఏదీ ఉండ‌ద‌ని..సినిమా అమ్మేసిన త‌ర్వాత న‌ష్ట‌మైనా , లాభ‌మైనా పంపిణీ దారుడికే చెందుతున్నాడు.

కొన్ని కేసెస్ లో నిర్మాత ఇన్వాల్వ్ మెంట్ ఉన్నా? అత‌డు పూర్తి స్థాయిలో బాధ్య‌త వహించ‌డ‌న్నారు. భ‌విష్య‌త్ లో ఇలాంటి పోస్ట‌ర్ల‌కు అవ‌కాశం ఉండ‌క పోవ‌చ్చు అన్నారు. అలాగే డైరెక్ట‌ర్ల‌కు కార్లు గిప్టులు ఇవ్వ‌డం అన్న‌ది కూడా అవ‌న‌స‌రంగా భావించారు. నిజంగా సినిమా విజ‌యం సాధించి మంచి లాభాలు వ‌స్తే ఇచ్చినా త‌ప్పు లేద‌ని..కానీ ముందొస్తుగానే కార్లు ఇచ్చి బుట్ట‌లో వేడ‌యం అన్న‌ది వెర్రిత‌నం అనేసారు. తాను మాత్రం సినిమాకు నిజంగా లాభాలు వ‌చ్చిన‌ప్పుడే త‌న సంతోషం కొద్ది అలాంటి ప‌నులు చేస్తాన‌న్నారు. కానీ భ‌విష్య‌త్ లో ఇలాంటి ఉచితాలు ఇవ్వ‌డం తాను కూడా ఆపేస్తాన‌న్నారు.

ఒక సినిమాకు డైరెక్ట‌ర్ పారితోషికం తీసుకున్న త‌ర్వాత ఇలాంటి తాయిలాలు ఇవ్వ‌డం అన్న‌ది వ్య‌క్త‌గ‌త‌మే అయినా ? వాళ్ల‌ను చూసి మ‌రికొంత మంది అలా త‌యారవుతున్నార‌న్నారు. ఈ విష‌యంలో నిర్మాత‌లు మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ విష‌యంపై తాను కూడా సీరియ‌స్ గానే ఆలోచ‌న చేస్తున్నా న‌న్నారు. నిర్మాత‌ జెన్యూన్ గా కంటెంట్ పై దృష్టి పెట్టి ప‌ని చేయ‌గ‌ల్గితే? మంచి ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చ‌న్నారు.క్రియేటివ్ విభాగంలో వారు నిర్మాత‌లు కూడా నాలెడ్జ్ సంపాదించ‌గ‌లిగితే మంచి ఫ‌లితాల‌కు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.