బాక్సాఫీస్ విజయాన్ని నిర్ణయించేది వసూళ్లా లేక మార్చిన లెక్కల
సినిమా ఇండస్ట్రీ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే భారీ రికార్డులను కొల్లగొడుతుందంటూ రికార్డ్ కలెక్షన్స్ ను సాధించిందంటూ పోస్టర్స్ రిలీజ్ చేస్తుంటారు.
By: Gopi Velupala | 22 Oct 2026 6:00 AM ISTసినిమా ఇండస్ట్రీ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే భారీ రికార్డులను కొల్లగొడుతుందంటూ రికార్డ్ కలెక్షన్స్ ను సాధించిందంటూ పోస్టర్స్ రిలీజ్ చేస్తుంటారు. వారం ముగిసే సరికి మా హీరో భారీ రికార్డులను తుడిచిపెట్టారు అంటూ ప్రొడ్యూసర్లు సైతం పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. దీనివల్ల అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాలి అనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్లు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ లెక్కల వెనుక ఉన్న అసలు వాస్తవం ఏమిటి? బాక్సాఫీస్ విజయాన్ని నిర్ణయించేది ఏంటి? కేవలం ప్రచారంలో వినిపించే సంఖ్యలే విజయానికి కారణమవుతున్నాయా? లేదంటే తెర వెనక జరిగే వేరే అంశాలు ఏమైనా ఉంటాయా అనే చర్చ సినీ వర్గాల్లో తీవ్రంగా జరుగుతుంది...
బిజినెస్ విలువ అంటే ఏమిటి?
సినిమా థియేటర్లోకి రావడానికి ముందే ప్రొడ్యూసర్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ పేరుతో నైజాం, సీడెడ్ ఓవర్సీస్ అంటూ కొంతమంది డిస్ట్రిబ్యూటర్ల కు ఆ మూవీ రైట్స్ ను ఇచ్చేస్తారు. ఎన్ని డబ్బులు పెట్టి ఆ రైట్స్ తీసుకోవాలనేది ఆ హీరో కి ఉన్న క్రేజ్ ఆ మూవీ మీద క్రియేట్ అయినా బజ్ ను బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు..
గ్రాస్ కలెక్షన్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ షేర్...
సినిమా రిలీజైందంటే చాలు ప్రేక్షకులకు ఎక్కువగా గ్రాస్, నెట్, షేర్ అనే పదాలు వినిపిస్తుంటాయి. చాలా మందికి అవి ఏంటనేది తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది...
గ్రాస్ కలెక్షన్స్
థియేటర్లలో టికెట్స్ రూపంలో వచ్చే డబ్బులను 'గ్రాస్ కలెక్షన్స్' అంటారు. ఇందులో అన్ని రకాల ట్యాక్సెస్ కలిసి ఉంటాయి...
నెట్ కలెక్షన్స్
గ్రాస్ కలెక్షన్స్ నుంచి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని ట్యాక్సెస్, కొన్ని ఇతర ఖర్చులు అన్ని పోగా మిగిలే థియేట్రికల్ ఆదాయాన్ని 'నెట్ కలెక్షన్స్' అంటారు.
డిస్ట్రిబ్యూటర్ షేర్
థియేటర్ల మెయింటెనెస్ ఎగ్జిబ్యూటర్ల వాటా తదితర ఖర్చులన్నీ తీసివేయగా మిగిలే మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్ కు దక్కే వాటా అంటారు.
ఈ మూడింటిని వేరువేరుగా చూపడం వల్ల ప్రేక్షకుల్లో ట్రేడ్ వర్గాల్లో కొంతవరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బ్రేక్ ఈవెన్ అంటే ఏమిటి?
డిస్ట్రిబ్యూటర్ తను పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడాన్ని ఆదాయాన్ని బ్రేక్ ఈవెన్ అంటారు. సినిమా బిజినెస్ విలువ, డిస్ట్రిబ్యూటర్ షేర్, ఏరియాల వారీగా కుదిరిన ఒప్పందాల ఆధారంగా ఈ బ్రేక్ ఈవెన్ లెక్కలు మారుతుంటాయి... ఉదాహరణకు ఒక ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ హక్కులను 10 కోట్లకు కొంటె డిస్ట్రిబ్యూటర్ తన 10 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది...
20% తగ్గింపు ఆరోపణలు
20 శాతం తగ్గింపు ఆరోపణలు ఇండస్ట్రీ లో తరచుగా వినిపించే ఒక వాదన ఏమిటంటే అసలు థియేట్రికల్ బిజినెస్ విలువను కొంత వరకు సుమారుగా 20 శాతం వరకు తగ్గించి బ్రేక్ ఈవెన్ త్వరగా సాధించినట్లు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తుంటాయి. నిజానికి సినిమా కలెక్షన్స్ లో వాస్తవాలు తేలాలంటే పంపిణీ హక్కుల అధికారికి ఒప్పందాలు నిర్మాతలు ప్రకటించే లెక్కలు డిస్ట్రిబ్యూటర్ల వాస్తవం పెట్టుబడుల వివరాలు పూర్తిగా తెలియాలి...సరైన ఆధారాలు పత్రాలు లేకుండా కేవలం ఊహాగానాల ఆధారంగా ఈ ఆరోపణలను పూర్తిగా నిర్ధారించడం సాధ్యం కాదు. అయితే మార్కెట్లో మాత్రం ఈ రకమైన లెక్కలు మార్పుపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది...
బాక్సాఫీస్ విజయాన్ని ఎలా నిర్ణయించాలి...
భారీ గ్రాస్ కలెక్షన్స్ పోస్టర్లు వేసినంత మాత్రాన ఆ సినిమా లాభాల్లో ఉందని ఖచ్చితంగా చెప్పలేము. ఒక సినిమా నిజమైన విజయాన్ని అంచనా వేయడానికి క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలి...
బడ్జెట్ వర్సెస్ షేర్
గ్రాస్ ఎంత వచ్చింది అనే దానికంటే డిస్ట్రిబ్యూటర్ వాటా ఎంత వచ్చిందనేది ముఖ్యం...దాన్ని బట్టే సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధించిందనేది తెలుస్తుంది.
ప్రచార ఖర్చులు
సినిమా నిర్మాణ వ్యయంతో పాటు పబ్లిసిటి కి అయిన ఖర్చులు...పబ్లిసిటి లేకపోతే సినిమా రిలీజ్ అవుతుందనేది కూడా ఎవరికి తెలియదు. దానివల్ల సినిమా బాగున్నప్పటికి దానిని చూసే ప్రేక్షకులు కరువవుతారు.
ప్రొడ్యూసర్ కి వచ్చే ఆదాయాలు
సినిమా రిలీజ్ కి ముందు వచ్చే ప్రీ రిలీజ్ బిజినెస్, శాటిలైట్, ఓటిటి, హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ ఆడియో రైట్స్ ద్వారా వచ్చిన లాభాలు...
ఏ రేట్లకు బిజినెస్ క్లోజ్ అయింది అని పూర్తి స్పష్టత...
కలెక్షన్ల ప్రచారంలో అభిమానులు ట్రేడ్ వర్గాలు వెల్లడించే వసూళ్ల గణాంకాల మధ్య కొన్నిసార్లు భారీ తేడాలు కనిపిస్తూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం సినిమా మీద హైప్ తీసురవడానికి చేసే ప్రచారాలు కావచ్చు, వాల్ పోస్టర్ల ట్రెండ్ మరియు మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు. అందరు ఒకే రకమైన ప్రామాణిక కొలమానాన్ని ముఖ్యంగా గ్రాస్ షేర్ ఆధారంగా అనుసరించడం ఎందుకు ముఖ్యమంటే అప్పుడే పరిష్కరణ పై నమ్మకం నిలబడుతుంది. నిజమైన విజయాలు వెలుగులోకి వస్తాయి...
విజయాన్ని నిర్ణయించడానికి ప్రచారంలో వినిపించే పెద్ద సంఖ్యల కంటే నిజంగా పెట్టిన బడ్జెట్ ఎంత? వాస్తవంగా వచ్చిన షేర్ ఎంత? బ్రేక్ ఈవెన్ మార్క్ ను సులభంగా చేరిందా? లేదా అనే ప్రశ్నలకు దొరికే స్పష్టమైన సమాధానాలే ముఖ్యం.. కేవలం వసూళ్ల హోరు కంటే మార్చిన లెక్కల మాయాజాలం దాటి నిజమైన లాభాలను బేరీజు వేసుకోవడమే అసలైన బాక్సాఫీస్ విజయానికి నాంది...
