చిరు, పవన్, చరణ్ ఓకే.. మరి నాని సంగతేంటి?
విశ్వంభర మూవీ గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది.
By: M Prashanth | 4 Feb 2026 10:34 PM ISTటాలీవుడ్ లో రిలీజ్ డేట్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సెట్స్ పై ఉన్న బడా సినిమాల విడుదల తేదీలు ఆయా మేకర్స్ ప్రకటిస్తున్నా.. ఆ డేట్స్ కు మాత్రం రిలీజ్ చేయడం లేదు. వివిధ కారణాలతో పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందే ప్లాన్ చేసుకుని డేట్స్ ఫిక్స్ చేయండని కోరుతున్నారు.
అదే సమయంలో తమ అభిమాన హీరోల చిత్రాల విడుదల తేదీలపై క్లారిటీ ఇవ్వాలని కూడా పోస్టులు పెడుతూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్ చిత్రాల కోసమే ఎక్కువ పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికొస్తే.. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ముందు నుంచి వేసవిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నా.. విడుదల తేదీని ప్రకటించలేదు. కానీ తాజాగా మార్చి 26న సినిమా విడుదల చేస్తామని వెల్లడించారు. పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అదే సమయంలో చరణ్ పెద్ది మూవీ.. అదే నెల 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.
బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఆ సినిమా ఇప్పుడు సెట్స్ పైనే ఉంది. ప్లాన్ ప్రకారమే షూటింగ్ జరుగుతుందని టాక్ వచ్చినా.. రీసెంట్ గా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. మార్చి 27వ తేదీన బదులు.. ఏప్రిల్ 30వ తేదీన సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే పెద్ది వాయిదా పడడం వల్ల.. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26వ వస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
విశ్వంభర మూవీ గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. కొన్ని నెలల క్రితం చిరంజీవినే.. సమ్మర్ లో విశ్వంభర రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ విడుదల తేదీ అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు జులై 9 లేదా 10వ తేదీన ఆ సినిమా... థియేటర్స్ లో విడుదల అవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలో ప్రకటించనున్నారట.
ఇక ది ప్యారడైజ్ విషయానికొస్తే.. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఆ సినిమా షెడ్యూల్ ప్రకారం మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ పార్ట్ చాలా పెండింగ్ ఉండడంతో పోస్ట్ పోన్ కన్ఫర్మే. అందుకే అదే రోజు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. అయితే ప్యారడైజ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియడం లేదు. అలా ఉస్తాద్, పెద్ది కొత్త డేట్స్ రాగా... విశ్వంభర తేదీ ఆల్మోస్ట్ ఫిక్స్ అవ్వగా.. ప్యారడైజ్ విషయంలో మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే.
