2027 సమ్మర్ బాక్సాఫీస్ టార్గెట్!
కొంత కాలంగా తెలుగు సినిమాలు ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఒక సినిమాను మించి మరో చిత్రం భారీ వసూళ్లతో కాక పుట్టిస్తోంది.
By: Srikanth Kontham | 23 July 2026 7:00 PM ISTకొంత కాలంగా తెలుగు సినిమాలు ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఒక సినిమాను మించి మరో చిత్రం భారీ వసూళ్లతో కాక పుట్టిస్తోంది. ఈనేపథ్యంలో రానున్న సమ్మర్ సీజన్ టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ వ్యాపారానికి, సరికొత్త సంచలనాలకు వేదిక కాబోతోంది. పాన్-ఇండియా స్థాయిలో అగ్ర హీరోలు, దిగ్గజ దర్శకుల కలయికలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌లు అన్నీ ఒకే సీజన్‌లో క్యూ కట్టడం సినీ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 2027 సమ్మర్ సీజన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 4000 కోట్ల భారీ బిజినెస్‌ను నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
మహా సమ్మర్ రేసులో ముందుగా మార్చి 5న పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `స్పిరిట్` విడుదల కానుంది. పోలీసు నేపథ్యంలో అత్యంత పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. మార్చి ప్రారంభంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో టాలీవుడ్ సమ్మర్ బాక్సాఫీస్ వేట అత్యంత గ్రాండ్‌గా ప్రారంభం కానుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అటుపై సమ్మర్ వేడిని మరింత పెంచుతూ ఏప్రిల్ 7న దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ `వారణాసి` ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ -హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్‌తో రూపుదిద్దుకుంటున్న చిత్రంపై గ్లోబల్ మార్కెట్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల అనంతరం బాక్సాఫీస్ రికార్డులన్నీ తలకిందులు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏకంగా 120 దేశాల్లో వారణాసి వసూళ్ల సునామీ సృష్టిస్తుందని భారీ అంచనాలున్నాయి. ఈ ఉత్కంఠకు తోడుగా
జూన్ 11న మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న `డ్రాగన్` చిత్రం సమ్మర్ సీజన్‌కు అదిరిపోయే ముగింపునివ్వనుంది. `సలార్`, `కేజీఎఫ్` వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తుందో? చెప్పాల్సిన పనిలేదు.
అలా మార్చి, ఏప్రిల్, జూన్ నెలల్లో వరుసగా వస్తున్న మూడు భారీ చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమనే కాకుండా భారతీయ బాక్సాఫీస్ రికార్డుల లెక్కలన్నింటినీ మార్చేయడం ఖాయమని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా రానున్న సంచలన ప్రాజెక్ట్‌ల వల్ల థియేటర్లలో ఎవర్గ్రీన్ పండగ వాతావరణం నెలకొంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
