Begin typing your search above and press return to search.

2026 లో కం బ్యాక్ ఇచ్చిన స్టార్స్!

ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌కు బ్రాండ్ గా నిలిచింది.

By:  Srikanth Kontham   |   12 Aug 2026 8:00 PM IST
2026 లో కం బ్యాక్ ఇచ్చిన స్టార్స్!
X

కొంత కాలంగా సరైన విజయాలు లేక సతమతమైన పలువురు స్టార్ హీరోలు 2026 లో సరికొత్త కథలతో బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాలు అందుకున్నారు. హిట్లు కొట్టడమే కాకుండా తమదైన శైలిలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని ఏడాదిని కెరీర్‌లో మోస్ట్ మెమొరబుల్ ఇయర్‌గా మలుచుకున్నారు. ఈ జాబితాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ `కొరియన్ కనకరాజు` చిత్రంతో సరికొత్త ప్రయోగాన్ని చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో వరుణ్ లోని కామెడీ టైమింగ్‌ను, భిన్నమైన నటనను పూర్తిగా ప్రదర్శించి ప్రేక్షకులను కడుపుబ్బా న‌వ్వించి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు.వైవిధ్యమైన జోనర్‌ను ఎంచుకుని వ‌రుణ్‌ సాధించిన విజయం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

యువ హీరో అఖిల్ అక్కినేని సైతం `లెనిన్` చిత్రంతో శక్తివంతమైన మాస్ యాక్షన్ కంబ్యాక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు చేసిన రొమాంటిక్ లవర్ బాయ్ ఇమేజ్‌ను పూర్తిగా పక్కనపెట్టి ఊరమాస్ అవతారంలో అఖిల్ చూపిన దూకుడు అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా అఖిల్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. కెరీర్ కు తిరుగులేని విజయాన్ని అందించింది. ఈ విజ‌యంతో అక్కినేని ఫ్యామిలీ స‌హా అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

అలాగే టాలెంటెడ్ హీరో శర్వానంద్ .. స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ ఏడాదే సత్తా చాటారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన `మా ఇంటి బంగారం` చిత్రం తో మరోసారి అభినయ ప్రతిభతో అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చారు.

ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌కు బ్రాండ్ గా నిలిచింది.

శర్వానంద్ కూడా ఈ ఏడాది రిలీజ్ అయిన `నారీ నారీ న‌డుమ మురారీ` సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారు. వ‌రు స ప్లాప్ ల్లో ఉన్న శ‌ర్వాకు ఈ విజ‌యం మంచి ఊర‌ట‌నిచ్చింది. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసి తన స్టామినాను నిరూపించుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి `మన శంకర వరప్రసాద్ గారు` చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సునామీని సృష్టించారు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమాతో అన్న‌య్య కుటుంబ ప్రేక్షకులను, మాస్ అభిమానులను ఒకేలా అలరించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. చిరంజీవి కెరీర్‌లో ఈ సినిమా ల్యాండ్‌మార్క్ విజయంగా నిలిచి .. స్టార్‌డమ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది. అలాగే టాలెంట్‌తో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం `చెన్నై లవ్ స్టోరీ` చిత్రంతో మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ద్వారా నటుడిగా మరింత పరిణతి చెందడమే కాకుండా యువతను బాగా ఆక ట్టుకున్నారు. మొత్తంగా 2026 సంవత్సరం టాలీవుడ్‌లో పలువురు స్టార్లకు అద్భుతమైన విజయాలను అందించి.. వారి కెరీర్‌కు సరికొత్త ఊపునిచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.