పాన్ ఇండియా మూవీ.. హీరో, డైరెక్టర్ మధ్య గ్యాప్?
దీనివల్ల బడ్జెట్ పెరగడమే కాకుండా, సినిమా రిలీజ్ డేట్ కూడా వెనక్కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
By: M Prashanth | 23 April 2026 8:00 PM ISTసినీ ఇండస్ట్రీలో ఒక భారీ ప్రాజెక్ట్ మొదలైందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. ముఖ్యంగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరో, క్రేజీ డైరెక్టర్ కలిస్తే ఆ సినిమా బిజినెస్ లెక్కలు కూడా మారిపోతాయి. కానీ కొన్నిసార్లు అతి పెద్ద అంచనాలే ఆ సినిమాకు శాపంగా మారుతుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ పరిస్థితి కూడా ఇలాగే ఉందనే చర్చ ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
అనౌన్స్ మెంట్ అప్పుడు ఉన్న జోష్, ఇప్పుడు షూటింగ్ దగ్గరకు వచ్చేసరికి కనిపించడం లేదని టాక్. అసలు విషయం ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ ఆశించినంత స్పీడ్ గా సాగడం లేదు. ప్రతి షెడ్యూల్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతోంది. దీనికి ప్రధాన కారణం హీరో దర్శకుడి మధ్య వస్తున్న క్రియేటివ్ డిఫరెన్సెస్ అని సమాచారం. సీన్ల చిత్రీకరణ విషయంలో ఇద్దరి ఆలోచనలు కలవకపోవడంతో, ప్రతి షెడ్యూల్ తర్వాత లాంగ్ గ్యాప్ వస్తోంది.
కొన్నిసార్లు అనుకున్న సీన్లు సరిగ్గా రాకపోవడంతో రీషూట్లు కూడా చేస్తున్నారట. దీనివల్ల బడ్జెట్ పెరగడమే కాకుండా, సినిమా రిలీజ్ డేట్ కూడా వెనక్కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలు అంటే అవుట్ పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు. హీరో తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఎలివేషన్లు ఉండాలని కోరుకుంటే, దర్శకుడు మాత్రం తన స్టైల్ మేకింగ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారట.
ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ కారణంగా షూటింగ్ ఆగిపోవడాలు లేదా వాయిదా పడటం వంటివి జరుగుతున్నాయని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. దీని ప్రభావం మిగతా టెక్నీషియన్ల డేట్స్ మీద కూడా పడుతోంది. ఒక షెడ్యూల్ ముగిసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికీ క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి భారీ చిత్రాలు లేట్ అయ్యే కొద్దీ ఆడియన్స్‌లో ఉన్న క్యూరియాసిటీ మెల్లిగా తగ్గే ప్రమాదం ఉంది.
ఇప్పటికే ఈ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు షికారు చేస్తున్నాయి. హీరో అభిమానులు సైతం షూటింగ్ అప్‌డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎలాంటి అఫీషియల్ క్లారిటీ రాకపోవడంతో సందేహాలు మరింత పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా అనుకున్న క్వాలిటీతో వస్తుందా లేదా అనే టెన్షన్ ట్రేడ్ వర్గాల్లో కూడా మొదలైంది. హీరో, డైరెక్టర్ కూర్చుని ఒక క్లారిటీకి వస్తే తప్ప ఈ గందరగోళం తొలగేలా లేదు. క్రియేటివ్ డిఫరెన్సెస్ సహజమే అయినా, అవి సినిమా భవిష్యత్తును దెబ్బతీసేలా ఉండకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ అడ్డంకులను దాటుకుని ఈ భారీ చిత్రం ఎప్పుడు పూర్తి అవుతుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
