ఆ ముగ్గురు బిగ్ బ్రేక్ కోసం వెయిటింగ్!
సక్సెస్ లో ఉండే కిక్ వేరు. ఆ కిక్ తో వచ్చే జోష్ వేరు. ఎన్ని సినిమాలు చేసినా? సక్సెస్ కిక్ లేనిదే అసలై మజా దొరకదు.
By: Srikanth Kontham | 26 Aug 2025 8:00 PM ISTసక్సెస్ లో ఉండే కిక్ వేరు. ఆ కిక్ తో వచ్చే జోష్ వేరు. ఎన్ని సినిమాలు చేసినా? సక్సెస్ కిక్ లేనిదే అసలై మజా దొరకదు. ఓ ముగ్గురు బ్యూటీలు ఆ సక్సెస్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారంటే? కళ్లు కాయలు కాచేలా? అనాలేమో! అవును పూజాహెగ్డే, కీర్తి సురేష్, శ్రుతి హాసన్, అనుష్క సక్సస్ కిక్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారంటే? ఉన్న పళంగా ఓ హిట్ పడితే తప్ప వేగం పుంజుకోలేమంటున్నారు. ముంబై నుంచి నేరుగా చెన్నైలో ల్యాండ్ అయినా పూజాహెగ్డే కంబ్యాక్ లో ఇంత వరకూ సక్సెస్ అందుకోలేదు.
ఆ రెండు సినిమాలపైనే:
`రెట్రో` ఫలితం నిరాశ పరిచింది. ఇటీవల రిలీజ్ అయిన `కూలీ` కూడా నిరుత్సాహాన్నే మిగిల్చింది. మోనికాగా మాస్ గా పాట రూపంలో కనెక్ట్ అయినా? సినిమా మాత్రం అంచనాలు అందుకోవడంలో విఫల మైంది. ప్రస్తుతం పూజాహెగ్డే తమిళ్ లోనే రెండు సినిమాలు చేస్తోంది. విజయ్ సరసన `జననాయగన్` లో నటిస్తుంది. మరో సినిమా `కాంచన 4`. తెలుగులో ఛాన్సులే రాలేదు. దీంతో ఈ రెండు సినిమాలపైనే బుట్టబొమ్మ ఆశలన్నీ పెట్టుకుంది. వీలైనంత త్వరగా హిట్ అందుకుని సక్సస్ రేసులో రావాలని ఆశ పడుతుంది.
సౌత్ మార్కెట్ కీలకంగా:
మాలీవుడ్ నటి కీర్తి సురేష్ ట్రాక్ కూడా ఇలాగే ఉంది. `దసరా` తర్వాత సరైన హిట్ ఒక్కటీ లేదు. `దసరా` అనంతరం ఏడు సినిమాలు చేసింది. ఆ ఏడింటిలో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం `రివాల్వర్ రీటా`లో నటిస్తోంది. బాలీవుడ్ లో ఓ బోల్డ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సిరీస్ కంటే సినిమాపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. సౌత్ మార్కెట్ కీలకంగా భావించడంతో? ఇక్కడే సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలనే ఆశతో ఎదురు చూస్తోంది. స్వీటీ అనుష్క కూడా `ఘాటీ`పై అలాంటి ఆశలు...అంచనాలే పెట్టుకుంది.
రొమాంటిక్ హిట్ కోసం:
`ఘాటీ`నే అసలైన కంబ్యాక్ చిత్రంగా భావిస్తోంది. `ఘాటీ` విజయంతో గత వైభవం అందుకోవాలని ఆశ పడుతుంది. అనుష్క ఇమేజ్.. ఘాటీపై ఉన్న బజ్ తో ఇదిసాధ్యమేనని ఎంతో నమ్మకంగా ఎదురు చూస్తోంది. మరోవైపు శ్రుతి హాసన్ కూడా సరైన గ్లామర్ పాత్రతో హిట్ కోసం వెయిట్ చేస్తోంది. `వాల్తేరు వీరయ్య` తర్వాత కమర్శియల్ హిట్ లేదు. రీసెంట్ రిలీజ్ `కూలీ`లో పాత్రకు ప్రాధన్యం ఉన్నా? హీరోతో రొమాన్స్ లేని చిత్రం కావడంతో? ఓ రొమాంటిక్ హిట్ అంతే కీలకం అంటోంది. అయితే శ్రుతి చేతిలో మాత్రం కమిట్ మెంట్లు ఏవీ కనిపించలేదు. ఛాన్స్ రావాలి...హిట్ కొట్టాలి అన్నదే కమిట్ మెంట్ గా ముందుకెళ్తోంది.
