Begin typing your search above and press return to search.

ప్లాన్ మార్చకపోతే అమ్మడు పెట్టా బేడా సర్ధేయాల్సిందే..!

టాలీవుడ్ లో శ్రీలీల టైం బ్యాడ్ ఇంకా నడుస్తూనే ఉంది. పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు నెక్స్ట్ మాస్ మహరాజ్ రవితేజతో ధమాకా చేసి సూపర్ హిట్ అందుకుంది.

By:  Ramesh Boddu   |   2 Nov 2025 12:27 PM IST
ప్లాన్ మార్చకపోతే అమ్మడు పెట్టా బేడా సర్ధేయాల్సిందే..!
X

టాలీవుడ్ లో శ్రీలీల టైం బ్యాడ్ ఇంకా నడుస్తూనే ఉంది. పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు నెక్స్ట్ మాస్ మహరాజ్ రవితేజతో ధమాకా చేసి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ సినిమా నుంచి వరుస ఛాన్స్ లు అందుకోగా అందులో ఏది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. భగవంత్ కేసరి తో అమ్మడు యాక్షన్ సీన్స్ కూడా చేయగలదు అని ప్రూవ్ చేసుకుంది. ఆ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అంటే శ్రీలీల కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ శ్రీలీల లాస్ట్ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం సినిమా చేసింది. ఆ సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా సినిమాలో ఆమె డాన్స్ తప్ప ఏమి లేదని అనుకున్నారు.

శ్రీలీల పాత్రల ఎంపికలో..

శ్రీలీల సినిమాలో ఉంటే డాన్స్ లు అదిరిపోతాయి.. ఐతే ఆమె పాత్రల ఎంపికలో మాత్రం ఇంకా తప్పులు చేస్తూనే ఉంది. శ్రీలీల లేటెస్ట్ సినిమా మాస్ జాతర తో ట్రాక్ ఎక్కుతుందేమో అనుకుంటే ఆ సినిమాతో కూడా ఆమె అదే రొటీన్ పంథాలో వెళ్లినట్టు అయ్యింది. డాన్స్ ల విషయంలో శ్రీలీల వైపు వేలెత్తి చూపించే పనిలేదు. కానీ కేవలం డాన్స్ లు ఒక్కటే సరిపోతాయా అన్నది ఎదురవుతున్న ప్రశ్న. మరోపక్క మాస్ జాతర సినిమాలో శ్రీలీల లుక్ షాక్ అయ్యేలా చేసింది.

బాలీవుడ్ నీళ్లు పడినట్టు ఉన్న అమ్మడు జీతో సైజ్ తో షాక్ ఇచ్చింది. ఐతే హిందీలో అలా ఉంటేనే చూస్తారన్న సెంటిమెంట్ ఉన్నా తెలుగు ఆడియన్స్ మునుపటి శ్రీలీలని ఇష్టపడారన్న లాజిక్ మర్చిపోయింది. పోనీ సినిమాల ఫలితాలు ఏమైనా ఆశాజనకంగా ఉన్నాయా అంటే అది లేదు. రవితేజతో మాస్ జాతర చేసిన శ్రీలీల విలేజ్ బ్యాక్ డ్రాప్ స్లాంగ్ మార్చిందే తప్ప పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇక సాంగ్స్ లో ఐతే అదరగొట్టేసింది.

డాన్స్ లు ఒక్కటే సరిపోదు..

శ్రీలీల సినిమాలో ఉంది అంటే ఆమె నుంచి బలమైన క్యారెక్టర్ ఆశించే ఆడియన్స్ కి మళ్లీ మళ్లీ డిజప్పాయింట్ తప్పట్లేదు. డాన్స్ లు ఒక్కటే సరిపోద్దా అంటే సినిమాకు ఎలాగోలా బజ్ తెస్తాయని సమర్ధించుకోవడం తప్ప మరేది లేదు. మరి శ్రీలీల విషయంలో జరుగుతున్న ఈ తప్పులు సరిదిద్దుకుంటుందా లేదా అన్నది చూడాలి. టాలీవుడ్ లో అయితే శ్రీలీలకు చాలా టఫ్ టైం నడుస్తుంది.

మాస్ జాతర మీద చాలా హోప్స్ పెట్టుకున్న అమ్మడికి నిరాశ తప్పలేదు. ఇక నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తుంది శ్రీలీల. ఆ సినిమాతో అయినా అమ్మడు హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి. హిందీలో మాత్రం కార్తీక్ ఆర్యన్ సినిమా సైన్ చేసినప్పటి నుంచి ఏదో ఒక విధంగా శ్రీలీల బాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉంటుంది.