Begin typing your search above and press return to search.

సైమా వేడుకల్లో సాయి పల్లవి అలాంటి పని.. ఇది ఊహించలేదు భయ్యా!

ఇదిలా ఉండగా.. తాజాగా దుబాయ్ సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసింది సాయి పల్లవి.. అక్కడ తన డ్రెస్సింగ్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంది.

By:  Madhu Reddy   |   9 Sept 2025 10:35 AM IST
సైమా వేడుకల్లో సాయి పల్లవి అలాంటి పని.. ఇది ఊహించలేదు భయ్యా!
X

సాయి పల్లవి.. పద్ధతికి కేరాఫ్ అడ్రస్.. 60, 70 లలో సావిత్రి ఎలా అయితే పేరు దక్కించుకున్నారో.. 90 లలో సౌందర్య ఎలా అయితే తన అందంతో ఆకట్టుకున్నారో.. ఇప్పుడు వారి జాడలో నడుస్తూ సాంప్రదాయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సాయి పల్లవి. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఉర్రూతలూగిస్తోంది. నటన విషయానికొస్తే.. మరో మార్క్ అందుకుందని చెప్పవచ్చు. అందుకే "లేడీ పవర్ స్టార్" అనే ట్యాగ్ ను కూడా సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. చాలా సెలెక్టెడ్ గా పాత్రలు ఎంచుకుంటూ ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తూ అలరిస్తోంది.


ఇదిలా ఉండదా.. ప్రస్తుతం సౌత్ సినిమాలకు పెద్దగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఈమె.. బాలీవుడ్లో హిందీ రామాయణంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ సరసన సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు వీరి గెటప్స్ సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ఇండియన్ చరిత్రలో సుమారుగా రూ.4వేల కోట్లకు పైగా బడ్జెట్ తో హాలీవుడ్ చిత్రాలకు దీటుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.


ఇదిలా ఉండగా.. తాజాగా దుబాయ్ సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసింది సాయి పల్లవి.. అక్కడ తన డ్రెస్సింగ్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆరెంజ్ కలర్ చీర పై వైట్ కలర్ థ్రెడ్ తో చాలా అందంగా ఎంబ్రాయిడింగ్ చేసిన శారీ ని ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో అదే కలర్ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. రింగులు తిరిగిన కురులను గాలికి వదిలేసి కుర్రాళ్లతో హీట్ పుట్టించింది. చీర కట్టుకొని దుబాయ్ సైమా అవార్డ్స్ రెడ్ కార్పెట్ పై అలా నడిచి వస్తుంటే ఈమె హుందాతనానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఒక్కసారిగా సాయి పల్లవి అందానికి ముగ్దులయ్యారని చెప్పవచ్చు.


ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అభిమానులతో ఈమె సెల్ఫీ దిగడం హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను సైమా అవార్డ్స్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. మొత్తానికి అయితే సాయి పల్లవి చాలా రోజుల తర్వాత ఇలా దర్శనమిచ్చి అందరిని మెస్మరైజ్ చేసిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సాయి పల్లవి కెరియర్ విషయానికి వస్తే.. 'ప్రేమమ్' సినిమాతో మలయాళం లో కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'ఫిదా' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత చాలా సెలెక్టెడ్ గా పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. దాదాపుగా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో సాయి పల్లవికి కూడా మంచి పేరు లభించింది. ఇకపోతే సినిమాల్లోకి రాకముందు ఢీ షో లో కంటెస్టెంట్ గా పాల్గొని సత్తా చాటింది.