Begin typing your search above and press return to search.

హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రెజీనా..

ఆ ఫోటోలు చూసినా చాలామంది నెటిజన్లు "హాట్ గా ఉన్నావు.. చెమటలు పట్టిస్తున్నావు" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

By:  Madhu Reddy   |   18 Sept 2025 8:00 PM IST
హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న రెజీనా..
X

రెజీనా కసాండ్రా.. తమిళనాడు హీరోయిన్ అయినప్పటికీ తెలుగు సినిమాల్లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది.. తమిళనాడు చెన్నైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోకి శివ మనసులో శృతి (SMS) అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో మెరిసింది. అలా ఈ హీరోయిన్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో నటిగా రాణించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోల ద్వారా హాట్ టాపిక్ గా మారింది.


ఆ ఫోటోలు చూసినా చాలామంది నెటిజన్లు "హాట్ గా ఉన్నావు.. చెమటలు పట్టిస్తున్నావు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా రెజీనా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో బ్లాక్ కలర్ పార్టీవేర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసుకుంది. ఆ ఫోటోలలో రెజీనా కసాండ్రా అచ్చం ప్రిన్సెస్ లాగే మెరిసిపోతుంది. ప్రిన్సెస్ వేసుకునే డ్రెస్ తో పాటు ఆమె హెయిర్ స్టైల్ కూడా అచ్చం ప్రిన్సెస్ మాదిరి లాగే ఉండడంతో అచ్చం దేవకన్యలా, రాజకుమారిలా ఉన్నావు అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ బ్లాక్ కలర్ డ్రెస్ కి వైట్ కలర్ పూసల చైన్ ని కాంబినేషన్ గా మెడలో ధరించింది రెజీనా..


అలాగే చేతికి కూడా పూసల బ్రేస్లెట్ ని పెట్టుకోవడంతో మరింత లుక్ వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ హాట్ హాట్ గా కామెంట్లు పెట్టడంతో పాటు హాట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. ఈ బ్లాక్ డ్రెస్ ఫోటోల కింద రెజీనా "హలో అపరిచితుడు.. మిస్ కసాండ్రా..మీకు వీలైతే" అంటూ క్యాప్షన్ పెట్టింది.


ఇక రెజీనా కసాండ్రా సినిమాల విషయానికి వస్తే.. తమిళంలో మూకుత్తి అమ్మన్ -2,కల్లా పార్ట్, అనంతన్ కాదు, పార్టీ,ఫ్లాష్ బ్యాక్, సూర్పనగై వంటి సినిమాల్లో చేస్తోంది. అలాగే తెలుగులో కైవల్య అనే సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ తగ్గని క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.


ఒకవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఢీ వంటి డాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ అభిమానులకు చేరువ అవుతోంది. మొత్తానికి అయితే వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రెజీనా ఇటు సోషల్ మీడియాలో కూడా అందాలు ఒలకబోస్తూ మరింత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.