వెకేషన్ లో రష్మిక.. వింటర్లో చిల్ అవుతూ..
అక్కడ స్ట్రీట్ ఫుడ్ ను రుచి చూస్తూనే.. మరొకవైపు రోమ్ వీధుల్లో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే అక్కడి నుండి పంచుకున్న ఫోటోలు అభిమానులలో సరికొత్త అనుమానాలు క్రియేట్ చేస్తున్నాయి.
By: Madhu Reddy | 30 Dec 2025 10:15 AM ISTప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా రోమ్ కి వెకేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె మైసా అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ కి కాస్త గ్యాప్ లభించడంతో ఏకంగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఈమె రోమ్ నగరానికి వెకేషన్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. అలాగే అక్కడ తన స్నేహితులతో కలిసి సందడి చేసింది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో నిత్యం యాక్టివ్ గా ఉండే రష్మిక మందన్న తాజాగా రోమ్ నగరంలో సందడి చేస్తున్న వీడియోలను, ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
అక్కడ స్ట్రీట్ ఫుడ్ ను రుచి చూస్తూనే.. మరొకవైపు రోమ్ వీధుల్లో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే అక్కడి నుండి పంచుకున్న ఫోటోలు అభిమానులలో సరికొత్త అనుమానాలు క్రియేట్ చేస్తున్నాయి. దీనికి కారణం రష్మిక షేర్ చేసిన ఫోటోలలో ఆనంద్ దేవరకొండ కనిపించారు. దీనికి తోడు గత రెండు రోజుల క్రితం విజయ్ దేవరకొండ ,రష్మిక మందన్న విడివిడిగా వీడియోలు షేర్ చేసినా.. అందులో ఎయిర్ పోర్ట్ బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ ఒకటే కనిపించింది. ఇప్పుడు ఈ ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతో రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో టూర్ కి వెళ్ళింది అని నెటిజన్స్ కూడా కన్ఫామ్ చేస్తున్నారు. మొత్తానికైతే రష్మిక మందన్న తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇదిలా ఉండగా మరొకవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి వేలికి ఉన్న ఉంగరాలే వీరికి నిశ్చితార్థం అయ్యింది అనే విషయాన్ని స్పష్టం చేశాయి. అటు స్టూడెంట్స్ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక మందన్న కూడా విజయ్ దేవరకొండను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపింది. ఇక మొత్తానికైతే ఎప్పుడు వివాహం చేసుకుంటావు అని ప్రశ్నించగా సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని క్లారిటీ ఇచ్చింది..కానీ పెళ్లి డేట్ పై ప్రకటించలేదు.
కానీ ఎట్టకేలకు ఫిబ్రవరి 26వ తేదీన వీరు వివాహం చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి దీనిపై వీరు స్పందిస్తారో లేదో చూడాలి. మొత్తానికైతే రష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
రష్మిక విషయానికి వస్తే ఈ ఏడాది ఛావా, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర, థామా అంటూ ఇలా ఈ ఏడాది ఏకంగా ఐదు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఈ చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మైసా సినిమాతో పాటు రెయిన్బో అనే సినిమాలో కూడా నటిస్తోంది. అంతేకాదు ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం.
