దీపాల వెలుగుల్లో రకుల్.. ఎంత అందంగా ఉందో?
ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పొడుగు కాళ్ళ సుందరి పంజాబీ బ్యూటీ అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ కి పేరు ఉండేది.
By: Madhu Reddy | 18 Oct 2025 4:45 PM ISTఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పొడుగు కాళ్ళ సుందరి పంజాబీ బ్యూటీ అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ కి పేరు ఉండేది. ఈ హీరోయిన్ తెలుగులో సందీప్ కిషన్ సరసన నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హిట్ కొట్టడంతో ఆ తర్వాత ఈమెకు తిరుగేలేకుండా పోయింది. ఒక్క హిట్ తో రకుల్ ప్రీత్ సింగ్ దశ మొత్తం తిరిగిపోయింది. అలా వరుసగా మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా వరుస పెట్టి స్టార్ హీరోల సరసన జత కట్టింది. అంతేకాదు స్టార్ హీరోలతో చేసి సౌత్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి ఈ మధ్యకాలంలో అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. కొన్ని సినిమాలు చేసినా కూడా అవి ఏవి హిట్ కాకపోవడంతో కాస్త వెనకబడిపోయింది అని చెప్పుకోవచ్చు.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోల ద్వారా ట్రెండింగ్ లోకి వచ్చింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మిరమిట్లు గొలుపే వెలుగుల కాంతిలో ఓ తారాజువ్వలా వెలిగిపోతోంది. దివాళి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది హీరోయిన్లు ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఫ్యాషన్ కి అనుగుణంగా ఉండే లేటెస్ట్ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడమే ఫీలింగ్ లైక్ ఏ పటాకా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఈ తారాజువ్వలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసాయి.
చుట్టూ లైటింగ్ తో రకుల్ ప్రీత్ సింగ్ అందాలు అద్భుతంగా మెరుస్తున్నాయి. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ మెడలో వేసుకున్న డైమండ్ హారం ఈమె అందాన్ని మరింత హైలెట్ చేసింది. చేతులకు బ్యాంగిల్స్, రింగ్స్ ధరించడమే కాకుండా చేతిలో డ్రెస్ కి మ్యాచింగ్ లో ఉండే చిన్న హ్యాండ్ బ్యాగ్ తో లుక్ ని కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ చూసిన చాలా మంది నెటిజన్లు దీపావళి పండగ మొత్తం రకుల్ ప్రీత్ సింగ్ చుట్టే ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పర్సనల్ ప్రొఫెషనల్ కెరియర్ విషయానికి వస్తే.. ఈ ముద్దుగుమ్మ గత ఏడాది బాలీవుడ్ నిర్మాత అయినటువంటి జాకీ భగ్నానీని పెళ్లి చేసుకొని ప్రస్తుతం పూర్తిగా ముంబైకే పరిమితం అయిపోయింది. అలాగే సౌత్ లో కూడా అంతగా ఆఫర్స్ రాకపోవడంతో రకుల్ అక్కడే సెటిల్ అయినట్టు తెలుస్తోంది.
ఈ హీరోయిన్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే.. దక్షిణాదిలో గత ఏడాది కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 మూవీలో మెరిసినప్పటికీ ఇందులో రకుల్ పాత్రకి అంత ప్రాధాన్యత అయితే లేదు. అలాగే ఈ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 3 కూడా రాబోతుంది. కాబట్టి ఇండియన్ 3లో రకుల్ పాత్రకి స్కోప్ ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్లో దేదే ప్యార్ దే -2 మూవీ తో పాటు పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ సూర్పనక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే ఆయుష్మాన్ ఖురానా హీరోగా.. సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్,వామిక గబ్బి లు హీరోయిన్లుగా ఓ కొత్త చిత్రం తెరకెక్కుతుందట. అదే పతి పత్ని ఔర్ వో సినిమాకి సీక్వెల్.. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 4న హోలీ సందర్భంగా విడుదల కాబోతున్నట్టు బీ టౌన్ లో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాల రిజల్ట్ మీదే రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ ఆధారపడి ఉంది. ఎందుకంటే ఈ సినిమాలు గనుక హిట్ కాకపోతే రకుల్ కి అవకాశాలు రావడం కష్టమే అని చెప్పుకోవచ్చు.
