Begin typing your search above and press return to search.

చీరకట్టులో మరింత అందంగా మారిన రాశిఖన్నా!

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఒకవైపు ఫాలోవర్స్ ను పెంచుకుంటూనే.. మరొకవైపు తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్నారు.

By:  Madhu Reddy   |   14 Oct 2025 3:00 PM IST
చీరకట్టులో మరింత అందంగా మారిన రాశిఖన్నా!
X

ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఒకవైపు ఫాలోవర్స్ ను పెంచుకుంటూనే.. మరొకవైపు తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది హీరోయిన్స్ ఇలా తమ గ్లామర్ తో ఆకట్టుకుంటూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పైగా సినిమాలకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా.


తన అందంతో.. అమాయకత్వంతో.. అంతకుమించి ఆకట్టుకునే నవ్వుతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టిలతో కలిసి 'తెలుసు కదా' అనే సినిమా చేస్తోంది. అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది. అందులో భాగంగానే ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటున్న ఈమె..ఇటు సోషల్ మీడియా ద్వారా గ్లామర్ డోస్ పెంచేసి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.


తాజాగా తెలుసు కదా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చీర కట్టులో దర్శనమిచ్చింది రాశి ఖన్నా.. క్రీమ్ కలర్ ప్రింటెడ్ చీర కట్టుకున్న ఈమె.. ఆ చీర పై ఆరెంజ్ రెడ్ కలర్ మిక్స్డ్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ తో చాలా అందంగా డిజైన్ చేశారు. దీనికి కాంబినేషన్లో బ్లౌజ్ ధరించిన ఈమె.. స్లీవ్ లెస్ అందాలతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. తాజాగా రాశి ఖన్నా షేర్ చేసిన ఈ సింపుల్ లుక్ ఫొటోస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.


రాశి ఖన్నా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుసు కదా సినిమాలో నటిస్తున్న ఈమె.. మరొకవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా.. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంతోపాటు బాలీవుడ్ లో 120 బహదూర్ అనే సినిమాతో పాటు మరో మూడు చిత్రాలకు అక్కడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


రాశిఖన్నా కెరియర్ విషయానికొస్తే మద్రాస్ కేఫ్ సినిమా ద్వారా సహాయక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో 2014లో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఉత్తమ మహిళా అరంగేట్రం విభాగంలో సైమా అవార్డును కూడా దక్కించుకుంది. ఆ తర్వాత బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవకుశ, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతిరోజు పండగే ఇలా చెప్పుకుంటూపోతే చాలా చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.