పూజాహెగ్డే పెళ్లికి గ్రీన్ సిగ్నెల్!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు గ్లామర్‌తో నటనతో అలరించిన నటి పూజాహెగ్డే వ్యక్తిగత జీవితానికి సంబం ధించిన ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.
By: Srikanth Kontham | 31 July 2026 9:00 PM ISTటాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు గ్లామర్‌తో నటనతో అలరించిన నటి పూజాహెగ్డే వ్యక్తిగత జీవితానికి సంబం ధించిన ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. తాజాగా అమ్మడు వివాహం గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూజాహెగ్డే పెళ్లికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని.. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుందంటూ బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా పూజాహెగ్డేకు సరైన అవకాశాలు రాని సంగతి తెలిసిందే. దీంతో అమ్మడు కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే పూజ తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీకి చెందినవారా ? వ్యాపార రంగం నుంచి ఎవరైనా వస్తారా? అనే దానిపై క్లారిటీ లేదు గానీ.. కుటుంబ సభ్యులు మాత్రం మంచి వరుడిని వెతికే పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. పూజాహెగ్డే తల్లిదండ్రులు తగిన వరుడిని అన్వేషిస్తున్నారని.. త్వరలోనే ఈ విషయమై కుటుంబ సభ్యుల సమక్షంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నటిగా ఎన్నో విజయాలను అందుకున్న పూజాహెగ్డే ఇప్పుడు జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో పూజాహెగ్డే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి పలుహౄర్లు రూమర్స్ వినిపించినప్పటికీ వాటిని ధృవీకరించలేదు. కెరీర్ పట్ల పూర్తి ఏకాగ్రత పెట్టిన అమ్మడు ఇప్పుడు కుటుంబం కోరిక మేరకు వివాహానికి సిద్ధమవ్వడం విశేషం. వివాహం తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తారా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం పెళ్లి వార్త నెట్టింట మార్మోగిపోతోంది. గ్లామరస్ హీరోయిన్‌గా టాలీవుడ్, బాలీవుడ్‌లలో స్టార్ హీరోల సరసన నటించిన పూజాహెగ్డే అందచందాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
అలాంటి అగ్ర నటి పెళ్లి పీటలెక్కిబోతుందనే వార్త తెలియగానే ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పూజాహెగ్డే జీవితంలో నూతన అధ్యాయం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటున్నారు. ఇక పూజాహెగ్డే సినిమాల విషయానికి వస్తే ఇటీవలే `జన నాయగన్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సరైన అవకాశాలు రాక ఇబ్బంది పడుతోన్న సమయంలో `జన నాయగన్` విజయంతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంది. కానీ ఆ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద రొటీన్ చిత్రంగానే తేలిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలకు సైన్ చేసింది. దీంతో వాటిపైన ఆశలన్నీ.
