పండుగ వేళ ఫెస్టివ్ కలెక్షన్స్ తో అదరగొట్టేసిన పూజా హెగ్డే!
రొటీన్ ఫోటోషూట్స్ తో కాకుండా వివిధ భంగిమల్లో ఉంటూ డ్రెస్సులు వేసుకొని తనలో ఉన్న ఆత్మ విశ్వాసాన్ని బయటపెట్టింది పూజా హెగ్డే.
By: Madhu Reddy | 25 Sept 2025 5:00 PM ISTట్రెండ్ ఫాలో అవ్వడం కాదు ట్రెండ్ సెట్ చేయడం అంటే అది పూజా హెగ్డే వల్లే సాధ్యమవుతుంది.. పూజా హెగ్డే ఇప్పటివరకు చాలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి గెస్ట్ గా వెళ్లడం వాటిని ప్రమోట్ చేయడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. అలా పూజా హెగ్డే సినిమాలతో పాటు నగలు, దుస్తులు ప్రమోట్ చేయడంలో భాగమవుతోంది. అయితే ప్రస్తుతం పండగ సీజన్ కాబట్టి తాజాగా ఈ హీరోయిన్ తన సోషల్ మీడియా ఖాతాలో సాంప్రదాయమైన కుర్తా సెట్స్ మొదలు లేటెస్ట్ వెస్ట్రన్ వేర్ దుస్తులకు సంబంధించిన దుస్తులను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఆ ట్రెండీ వేర్ డ్రెస్సుల్లో ఆకర్షిస్తోంది. పైగా అన్ని రకాల డ్రెస్ లను వేసుకొని అటు వెస్ట్రన్ ఇటు ట్రెడిషనల్ అన్నింటిని ప్రమోట్ చేస్తోంది. పూజా హెగ్డే వేసుకున్న ప్రతి ఒక్క డ్రెస్ ఆమెలో ఉన్న విశ్వాసాన్ని హైలెట్ చేస్తోంది.
రొటీన్ ఫోటోషూట్స్ తో కాకుండా వివిధ భంగిమల్లో ఉంటూ డ్రెస్సులు వేసుకొని తనలో ఉన్న ఆత్మ విశ్వాసాన్ని బయటపెట్టింది పూజా హెగ్డే. మొదట ఒక అద్భుతమైన పేస్టల్ పింక్ కలర్ కుర్తాని స్టైల్ చేసింది. ఈ లుక్ లో పూజా హెగ్డే గాంభీర్యం , సాంప్రదాయమైన కల్చర్ కనిపిస్తోంది.అలాగే రెండో ఫోటోలో బ్లాక్ కలర్ వెస్ట్రన్ వేర్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అలాగే గోల్డ్ కలర్ మరో వెస్ట్రన్ వేర్ ధరించింది. ఇక చివరిగా వైట్ ఎల్లో కాంబోలో వచ్చిన కుర్తాని వేసుకొని తన స్టైల్ ని ఫినిష్ చేసింది.అలా రకరకాల దుస్తులు వేసుకొని ఫోటోలకు ఫోజులిస్తూ తన లుక్ ని హైలెట్ చేసుకుంది. ఇవన్నీ కూడా ఒక స్టోర్ ప్రమోషన్స్ లో భాగంగానే చేసినట్లు క్యాప్షన్ లో జోడించింది
అంతేకాకుండా ఈ ఫోటోలకు క్యాప్షన్ గా "నాకు పండగ సీజన్ అంటే రంగులు,నవ్వు, ఇంట్లో మంచి అనుభూతినిచ్చే క్షణాలు.. సరికొత్త పండగ కలెక్షన్ వచ్చేసింది.స్టైలిష్ ఆనందం, వేడుకతో ఈ కలెక్షన్ నిండి ఉంది. ఈ ఉత్సాహం ఇక్కడితో ఆగదు కాబట్టి పండుగ ఆఫర్లు మీకోసం వేచి ఉన్నాయి.. అంటూ రాసుకొచ్చింది. అలా ఫెస్టివల్ కలెక్షన్ డ్రెస్సులతో పూజా హెగ్డే ఆకట్టుకుంది..
పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే..ఈ హీరోయిన్ చివరిగా తమిళ్ నటుడు సూర్యతో కలిసి రెట్రో మూవీలో కనిపించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ దళపతితో జననాయగన్, రాఘవ లారెన్స్ తో కాంచన-4 సినిమాలు చేస్తుంది.అలాగే బాలీవుడ్ లో హై జవానీ తో ఇష్క్ హోనా హై, సాంకీ సినిమాల్లో నటిస్తోంది.
