Begin typing your search above and press return to search.

ఎరుపు చీరలో ప్రభాస్ బ్యూటీ అందాలు.. స్మైల్ తోనే కట్టిపడేస్తూ..

సోషల్ మీడియా.. ఎంతోమంది పాపులారిటీకి అతిపెద్ద ఫ్లాట్ ఫారం అని చెప్పవచ్చు.

By:  Madhu Reddy   |   3 Jan 2026 3:24 PM IST
ఎరుపు చీరలో ప్రభాస్ బ్యూటీ అందాలు.. స్మైల్ తోనే కట్టిపడేస్తూ..
X

సోషల్ మీడియా.. ఎంతోమంది పాపులారిటీకి అతిపెద్ద ఫ్లాట్ ఫారం అని చెప్పవచ్చు. ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకొని.. సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. అయితే ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేదా చిన్న హీరోల పక్కన హీరోయిన్ గానో అవకాశం లభిస్తుంది. కానీ ఇక్కడ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫౌజీ మూవీలో అవకాశం లభించిందని తెలిసి ఓవర్ నైట్ లోనే ఈమె స్టార్ అయిపోయింది.





ఆమె ఎవరో కాదు ఇమాన్వి ఎస్మాయిల్. సీతారామం సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ఫౌజీ. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 1940ల నేపథ్యంలో యుద్ధం, న్యాయం ఆధారంగా రాబోతున్న ఈ పీరియాడిక్ డ్రామా మూవీ ఆగస్టు 2026లో థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది ఇమాన్వి.





ఇకపోతే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ను ప్రభాస్ పక్కన హీరోయిన్ గా తీసుకోవడం ఏంటని చాలామంది విమర్శలు గుప్పించారు. కానీ ఆమె ఇంస్టా ఐడి చూసిన తర్వాత చాలామంది ఆమె టాలెంట్ కు ఫిదా అయిపోయారు. ఆమె ఒక క్లాసికల్ డాన్సర్. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఇమాన్వి తాజాగా ఎరుపు రంగు చీర కట్టుకొని తన అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎరుపు రంగు చీరలో ప్రభాస్ బ్యూటీ అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.





ఇమాన్వి ఢిల్లీలో పుట్టింది. డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎంబీఏ పూర్తి చేసిన ఈమె నృత్యం పట్ల అభిరుచిని వదులుకోకుండా నిత్యం ప్రాక్టీస్ చేస్తూ కొత్త తరహా రీతిలో డాన్స్ చేస్తూ మరింత పాపులారిటీ అందుకుంది. ఈమె ఆసక్తిని గమనించిన ఈమె తండ్రి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేందుకు ప్రోత్సహించారు . దీంతో ఈమె ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ఫుల్ టైం డాన్సర్ గా మారిపోయింది. అటు ఈవెంట్లు , రీల్సు ఇదే ప్రపంచంగా మారిపోయింది. ఇప్పటికే 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న ఈమె తల్లి సహకారంతో మరింత ముందుకు వెళ్తోంది.





ముఖ్యంగా ఎక్స్ప్రెషన్స్ విషయంలో ఇమాన్వి తర్వాతే ఎవరైనా.. అంత అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ లక్షలాదిమంది అభిమానులను దక్కించుకుంది. సినిమాల్లోకి రాకముందే సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఈమెకు.. ఏకంగా ప్రభాస్ లాంటి హీరో పక్కన అవకాశం లభించింది. ఒకవేళ ఈ సినిమా గనుక మంచి విజయం అందుకుంది అంటే కచ్చితంగా టాలీవుడ్ లో ఈమెకు ఆఫర్లు క్యు కడతయనడంలో సందేహం లేదు. అయితే ఇదంతా ఎంతో దూరం లేదు అని చెప్పవచ్చు ఏది ఏమైనా మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైన ఇమాన్వికి త్వరలో వరుస అవకాశాలు తలుపుతాడుతాయని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.