Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : జిప్‌ ఓపెన్‌ చేసిన హెబ్బా

కుమారి 21ఎఫ్‌ సినిమాతో 2015లో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌.

By:  Ramesh Palla   |   1 Sept 2025 12:12 AM IST
పిక్‌టాక్‌ : జిప్‌ ఓపెన్‌ చేసిన హెబ్బా
X

కుమారి 21ఎఫ్‌ సినిమాతో 2015లో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్‌ సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంది. కానీ ఆ సినిమాలు పెద్దగా ఆడక పోవడంతో మెల్ల మెల్లగా ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్‌గా హెబ్బా పటేల్‌ అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఆకట్టుకుంటూ ఉంటుంది. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించడం ద్వారా హెబ్బా పటేల్‌ స్వతహాగానే ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. అందుకే హెబ్బా పటేల్‌ ఎలాంటి ఫోటోలు షేర్‌ చేసినా కూడా మంచి స్పందన దక్కించుకుంటూ ఉంటుంది. సినిమాలు పెద్దగా చేయకున్నా కూడా హెబ్బా పటేల్‌ కి హీరోయిన్స్ స్థాయి క్రేజ్‌, స్టార్‌డం దక్కింది అనడంలో సందేహం లేదు.


కుమారి 21ఎఫ్‌ హీరోయిన్‌..

2016 లో ఏకంగా మూడు సినిమాలు చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత కూడా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాల సంఖ్య పెంచుకున్న ఈ అమ్మడు క్వాలిటీ విషయంలో తప్పటడుగులు వేసింది. దాంతో కెరీర్‌ పరంగా మెల్ల మెల్లగా డౌన్ ఫాల్‌ మొదలైంది. తెలుగులో కుమారి 21ఎఫ్‌ సినిమా తర్వాత సాలిడ్‌ హిట్‌ పడలేదు. అయినా కూడా ఇప్పటికీ ఈమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, సోషల్‌ మీడియాలో ఈమె అందమైన ఫోటోలు షేర్‌ చేస్తే తెగ వైరల్‌ కావడానికి కారణం ఈమె అందం అనడంలో సందేహం లేదు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఉంటారు. ఆ మధ్య కాస్త బరువు పెరిగినట్లు అనిపించినా కూడా ఇప్పుడు ఈమె సన్నగా నాజూకుగా ఉంది అంటూ నెటిజన్స్‌ తెగ కామెంట్స్ చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.

నడుము అందం చూపిస్తున్న హెబ్బా పటేల్‌

హెబ్బా పటేల్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అందమైన ఫోటోలకు అంతా ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా నడుము అందం చూపిస్తూ జిప్‌ ఓపెన్ చేసి మరీ నాభి అందం చూపించడంతో చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందంకు టాలీవుడ్‌లో దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు, రావాల్సిన ఆఫర్లు రాలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసే ప్రతి ఫోటోకి మంచి స్పందన వస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే ఈ నడుము, నాభి అందం చూపించే ఫోటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు దాటినా కూడా ఫ్రెష్‌ ఫేస్‌ అన్నట్లుగానే హెబ్బా పటేల్‌ లుక్ ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ మూవీస్‌లోనూ

ఇలాగే అందం మెయింటెన్‌ చేస్తే ఖచ్చితంగా ముందు ముందు అయినా హెబ్బా పటేల్‌ కి సినిమా ఆఫర్లు రావాలని, సెకండ్ ఇన్నింగ్స్ లో మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 1988లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ముస్లీం కుటుంబంలో జన్మించిన ఈమె ముంబైలోని సోఫియా కాలేజ్ ఫర్‌ ఉమెన్‌ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తెలుగులో సినిమాలు చేయడానికి ముందు కన్నడంలో అధ్యక్ష అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా యావరేజ్‌గా నిలిచింది. అయినా కూడా అక్కడ మంచి గుర్తింపు దక్కించుకుంది. తమిళ్‌లోనూ ఈమె మంచి సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. కానీ లక్‌ కలిసి రాకపోవడంతో మరిన్ని ఆఫర్లు దక్కలేదు.