గ్లామర్ డోస్ పెంచేసిన జూ.సమంత..
ఆషు రెడ్డి.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జూనియర్ సమంతగా తనకంటూ ఒక పేరును సొంతం చేసుకుంది.
By: Madhu Reddy | 29 Dec 2025 3:52 PM IST
ఆషు రెడ్డి.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జూనియర్ సమంతగా తనకంటూ ఒక పేరును సొంతం చేసుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ వలకబోస్తూ ఫోటోలు షేర్ చేసే ఈమె.. తాజాగా మరో ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా బ్లేజర్ ను తలపించేలా గోల్డెన్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె.. అందులో తన అందాలు చూపిస్తూ బ్లాస్ట్ చేసింది. ముఖ్యంగా అందాలే హైలెట్ గా షేర్ చేసిన ఈ ఫోటోలకు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇలా గ్లామర్ షో చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది ఆషు రెడ్డి.
దీనికి తోడు ఇప్పుడు మరొకసారి అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ అమ్మడు అందాలతోనే అభిమానులను ఆకట్టుకుంటోంది.ఆషు రెడ్డి తెలుగు నటి మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 తో పాటు బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ లలో కూడా పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
అందం , ఫ్యాషన్, టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పలు ఇంటర్వ్యూలు , ఫోటోషూట్లతో పాటు సినిమాలలో కూడా నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది.ఇంస్టాగ్రామ్ వేదికగా మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈమె ఆ సంఖ్యను మరింత పెంచుకోవడానికి తరచూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నిత్యం ట్రెండింగ్ లో నిలుస్తోంది.
ఫ్యాషన్ ఐకాన్ గా.. గ్లామర్ సింబల్ గా మారిన ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. 2018 లో వచ్చిన చల్ మోహన్ రంగా అనే సినిమాతో నటన రంగా ప్రవేశం చేసి.. ఆ తర్వాతే బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది..2022 లో వచ్చిన ఫోకస్ అనే సినిమా ద్వారా లీడ్ రోల్ లో తన కెరీర్ ను ఆరంభించింది. అదే ఏడాది పీకే అనే సినిమాలో నటించింది. 2024లో పద్మవ్యూహంలో చక్రధారి అనే సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
నిజానికి రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ కారణంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఆ ఇంటర్వ్యూ కారణంగా అన్నే విమర్శలు ఎదుర్కొని.. ముఖ్యంగా తన తల్లిదండ్రులు తన అపార్ట్మెంట్లో తన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇటీవల ఒక టాక్ షో లో పాల్గొని వెల్లడించిన విషయం తెలిసిందే.
