Begin typing your search above and press return to search.

మినీ స్కర్ట్‌లో అషు గ్లామర్ బ్లాస్ట్

టాలీవుడ్ గ్లామర్ వరల్డ్‌లో అడుగుపెట్టిన తర్వాత అషు రెడ్డి స్టైల్, స్వాగ్‌కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది.

By:  M Prashanth   |   31 July 2025 3:00 AM IST
మినీ స్కర్ట్‌లో అషు గ్లామర్ బ్లాస్ట్
X

టాలీవుడ్ గ్లామర్ వరల్డ్‌లో అడుగుపెట్టిన తర్వాత అషు రెడ్డి స్టైల్, స్వాగ్‌కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. బిగ్ బాస్ షోలో తన ఉత్సాహభరితమైన బాడీ లాంగ్వేజ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ, తాజాగా తన గ్లామరస్ లుక్స్‌ తో మరోసారి నెట్టింట తెగ దూసుకుపోతోంది. షేర్ చేసిన ఫోటోషూట్‌లో అషు రెడ్డి రెడ్ కలర్ ఫ్లోరల్ టాప్, బ్లాక్ మినీ స్కర్ట్‌లో స్టన్నింగ్‌గా మెరిసిపోయింది.


ఈ లుక్‌లో ఆమె వేషధారణ మాత్రమే కాదు, హైహీల్స్, హెయిర్ ఫ్లిప్‌, ఎక్స్‌ప్రెషన్లు అన్నీ కలసి ఒక స్టైలిష్ స్టేట్మెంట్ లా మారాయి. “నా హీల్స్ నిన్ను ఎత్తుగా చేస్తాయని నాకు తెలుసు.…” అనే క్యాప్షన్‌తో ఆమె పోస్ట్‌కి యూత్ నుంచి రెస్పాన్స్ జెట్ స్పీడ్‌లో వచ్చింది. వేలల్లో లైకులు, ఆకట్టుకునే కామెంట్లతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ లుక్ చూస్తే క్లాస్‌కు గ్లామర్ ఎలా జోడించాలో అషుతో నేర్చుకోవాలి అంటున్నారు నెటిజన్స్.


ఇక అషు కెరీర్ విషయానికొస్తే, సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ, డబ్‌స్మాష్‌తో మొదలైన ప్రయాణం టీవీ నుంచి సినిమాల వరకు విస్తరించింది. బిగ్ బాస్ సీజన్ 3 ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆ షో ద్వారా ఆమె మాస్ ఆడియెన్స్‌లో తన ప్రత్యేకతను చూపించింది. ఆ తర్వాత కొన్ని స్పెషల్ షోలు, ఈవెంట్ హోస్టింగ్, గ్లామర్ ఫోటోషూట్లతో తనదైన గుర్తింపును క్రియేట్ చేసుకుంది.


అషు రెడ్డి స్పష్టంగా తెలుసుకొని ప్రయాణిస్తున్న విషయమేమిటంటే గ్లామర్ ద్వారా క్రేజ్ తెచ్చుకుంటే దానిని మెయింటైన్ చేయడమే అసలైన ఆర్ట్. ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ చూస్తేనే తెలుస్తుంది.. ప్రతీ ఫోటోలో ఓ థీమ్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. ముఖ్యంగా స్టైలింగ్, మేకప్, పోజింగ్, డ్రెస్సింగ్ డిజైన్ అన్నిటిలోనూ ఎంతో కేర్ తీసుకుంటుంది. మొత్తానికి, అషు రెడ్డి ఈ తాజా గ్లామర్ ఫోటోషూట్‌తో మరోసారి తన స్థాయిని నిరూపించుకుంది.