పొట్టి డ్రెస్సులో అనన్య పవర్ లుక్.. గ్లామర్‌కి కొత్త డెఫినిషన్
టాలీవుడ్‌లో తన సింపుల్ అండ్ న్యాచురల్ యాక్టింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల, ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యాషన్ స్టైల్‌తోనూ కుర్రాళ్ళ దృష్టిని ఆకర్షిస్తోంది.
By: M Prashanth | 10 Sept 2025 4:09 PM ISTటాలీవుడ్‌లో తన సింపుల్ అండ్ న్యాచురల్ యాక్టింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల, ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యాషన్ స్టైల్‌తోనూ కుర్రాళ్ళ దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు దీనికి నిదర్శనం. మెటాలిక్ సిల్వర్ డ్రెస్‌లో స్పార్క్‌లా మెరిసిపోయిన అనన్య, పవర్ మోడ్‌లో ఉన్నట్లు చెప్పుకుంటూ ఈ ఫోటోషూట్‌ను పంచుకుంది.
క్యాజువల్ గానే కాకుండా స్టైలిష్ గా కనిపించే ఈ లుక్‌లో ఆమె కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపించింది. రెడ్ లగ్జరీ కార్‌తో చేసిన ఫొటోషూట్, గ్లామర్‌ని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. డ్రెస్ కాంబినేషన్, మేకప్, హెయిర్ స్టైల్ అన్నీ కలిపి అనన్య వ్యక్తిత్వాన్ని హైలైట్ చేశాయి. ఈ లుక్‌ను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో మంచి రియాక్షన్స్ ఇస్తూ, "గ్లామరస్, క్లాసీ" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అనన్య నాగళ్ల కెరీర్ విషయానికి వస్తే, ఆమె "మల్లేశం" సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి నటనలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత "వకీల్ సాబ్"లో పవన్ కళ్యాణ్ పక్కన కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణమైన పాత్రలనుంచి సీరియస్ రోల్స్ వరకు చేస్తూ తనలోని వైవిధ్యాన్ని చూపించడంలో ఆమె విజయవంతమైంది.
ఇక ఇటీవల అనన్య కొన్ని వెబ్ ప్రాజెక్టులు, సినిమాలతో బిజీగా గడుపుతోంది. తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని కూడా సొంతం చేసుకుంది. యాక్టింగ్ మాత్రమే కాకుండా, ఫ్యాషన్ ఫీల్డ్‌లోనూ తనదైన గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే తరచూ ఇలాంటి కొత్త లుక్స్‌తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
