బికినీ అందాలతో రచ్చ చేస్తున్న బాలీవుడ్ నటి.. ఫోటోలు వైరల్!
ఇటీవల మాల్దీవ్స్ కి వెకేషన్స్ కి వెళ్ళిన ఈమె.. అక్కడి నుండి ఒక రిసార్ట్లో ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
By: Madhu Reddy | 9 Oct 2025 4:00 PM ISTప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు గ్లామర్ ప్రదర్శన చేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఫాలోవర్స్ ను పెంచుకోవడం అనే మాట అటు ఉంచితే.. ఎక్కువగా వెకేషన్స్ కి వెళ్తూ అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ.. వీరు చేసే సందడి అంతా కాదు. ముఖ్యంగా అక్కడి నుంచి వీరు షేర్ చేసే ఫోటోలు చూస్తే మాత్రం అభిమానులలో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి అనడంలో సందేహం లేదు. అంతేకాదు మనకు తెలియని ఎన్నో ప్రదేశాలను ఈ సెలబ్రిటీలు అలా ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే వీరికి ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోతున్నారు. అలా తమ అందాలతో పాపులారిటీ కూడా దక్కించుకుంటున్నారు ఈ హీరోయిన్స్. ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు ఎక్కువగా చాలామంది హీరోయిన్లు బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ జాబితాలోకి ఇప్పుడు మరో బ్యూటీ కూడా వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు అమైరా దస్తూర్.
ఇటీవల మాల్దీవ్స్ కి వెకేషన్స్ కి వెళ్ళిన ఈమె.. అక్కడి నుండి ఒక రిసార్ట్లో ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో ప్రింటెడ్ ఆరెంజ్ కలర్ బికినీ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. షిప్పులో, స్విమ్ చేస్తూ.. అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ.. షేర్ చేసిన ఫోటోలు చూసే అభిమానులకు కూడా ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అంతేకాదు ఆమె తిన్న ఫుడ్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది అమైరా దస్తూర్. ప్రస్తుతం అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమైరా దస్తూర్ కెరియర్ విషయానికి వస్తే.. 1993 మే 7వ తేదీన ముంబై మహారాష్ట్రలో జన్మించింది. మోడల్ గా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె 2013లో హిందీ చిత్రం 'ఇసాక్' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. హిందీలోనే కాదు తెలుగు, తమిళ్ భాషల్లో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. 2013లో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. 2018లో వచ్చిన 'మనసుకు నచ్చింది' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో నిత్యా పాత్ర పోషించి అభిమానులను ఆకట్టుకుంది.
ఆ తర్వాత 'రాజుగాడు' అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. అంతేకాదు తాను నటించిన తొలి సినిమా ఇసాక్ కోసం ఉత్తమ నటి తొలి పరిచయం విభాగంలో ఫిలింఫేర్ అవార్డ్స్ కి నామినేట్ కూడా అయ్యింది. అలాగే తమిళంలో వచ్చిన తన తొలి చిత్రం 'అనేగన్' సినిమా కోసం కూడా సైమా అవార్డ్స్ కి ఎంపిక అయింది. చివరిగా భగీర అనే తమిళ చిత్రంలో నటించిన ఈమె.. మూడు వెబ్ సిరీస్లలో కూడా నటించింది. 2022లో చివరిగా తెరపై కనిపించిన దస్తూర్ మళ్లీ అటు సినిమాలలో కానీ ఇటు వెబ్ సిరీస్ లలో కానీ కనిపించలేదు. ప్రస్తుతం ఇలా వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది.
