Begin typing your search above and press return to search.

నో డైటింగ్..ఓన్లీ ఫైటింగ్!

సినీ పరిశ్రమలో గ్లామర్ అనేది అత్యంత ప్రధానమైన అంశం. వెండితెరపై ఫిట్‌గా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం హీరోలు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.

By:  Srikanth Kontham   |   16 April 2026 1:18 PM IST
నో డైటింగ్..ఓన్లీ ఫైటింగ్!
X

సినీ పరిశ్రమలో గ్లామర్ అనేది అత్యంత ప్రధానమైన అంశం. వెండితెరపై ఫిట్‌గా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం హీరోలు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. జిమ్‌లో గంటల తరబడి వర్కవుట్లు చేయడమే కాదు. నోరు కట్టే సుకుని కఠినమైన డైటింగ్ ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా కమర్షియల్ హంగులు ఉన్న సినిమాల్లో సిక్స్ ప్యాక్ , స్లిమ్ లుక్ కోసం చాలా మంది హీరోలు తమకు ఇష్టమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. కేవలం ప్రొటీన్ ఫుడ్ మీద ఆధారపడి రోజులు గడుపుతుంటారు. టాలీవుడ్‌లో నాన్ వెజ్ ప్రియులుగా ప్రభాస్ , ఎన్టీఆర్‌లకు మంచి పేరుంది.

ఇద్ద‌రు విభిన్న రకాల నాన్ వెజ్ వంటకాలను రుచి చూడటమే కాదు. ఇతరులకు ప్రేమతో వడ్డించడంలోనూ ముందుంటారు. `ముక్క లేనిదే ముద్ద దిగని బ్యాచ్. అలాంటి వీరు కూడా కొన్ని సినిమాల కోసం తమ ఇష్టాలను పక్కన పెట్టారు. తమ ఆహారపు అలవాట్లను పూర్తిగా నియంత్రించుకుని ఆ పాత్రలకు కావాల్సిన శరీర సౌష్టవాన్ని సాధించి ఆశ్చర్యపరిచారు. అయితే యువ హీరో శ్రీవిష్ణు మాత్రం ఈ విషయంలో అందరికంటే భిన్నంగా ఆలోచిస్తున్నాడు. సాధారణంగా యంగ్ హీరోలు తమ బాడీ ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.

కానీ శ్రీవిష్ణు మాత్రం తనకు ఎలాంటి డైటింగ్ నియమాలు లేవని కుండబద్దలు కొట్టాడు. తనకు ఇష్టమైన ఆహారాన్ని తృప్తిగా తింటేనే పని చేయడానికి అవసరమైన శక్తి వస్తుందని నమ్ముతున్నాడు. `నో డైటింగ్.. ఓన్లీ ఫైటింగ్` అంటూ ఆయన అనుసరిస్తున్న విధానం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. శ్రీవిష్ణు శైలి చూస్తుంటే ఆహారం విషయంలో అస్సలు రాజీ పడ‌నంటున్నాడు. కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ నీరసంగా ఉండటం కంటే పుల్లుగా తిని సెట్స్‌లో ఉత్సాహంగా పని చేయడమే ఉత్తమమని భావిస్తున్నాడు. షూటింగ్ సమయంలో కూడా భోజనం విష యంలో ఎలాంటి కండిషన్లు పెట్టుకోకుండా ఇష్టమైన వంటకాలను ఆరగిస్తుంటాడుట‌.

అలాగ‌ని ఆరోగ్యం మీద‌కు మాత్రం తెచ్చుకోను అంటున్నాడు. ఆరోగ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చిన త‌ర్వాత మిగ‌తా వాటి గురించి ఆలోచిస్తాన‌న్నాడు. శ్రీవిష్ణు కేవలం సిక్స్ ప్యాక్ లేదా కండలు పెంచడం మీద కాకుండా కథాబలం ఉన్న సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తాడు. అందుకే ఫిజిక్ కంటే పర్‌ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలను ఎంచుకుంటున్నాడు. ఆహారం తింటూనే తగినంత శారీరక శ్రమ చేస్తూ ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన నిరూపిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ్రీ విష్ణు కెరీర్ పుల్ స్వింగ్ లో ఉంది. వ‌రుసగా విజ‌యాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. `సింగిల్` విజ‌యంతో ఫాంలో కి వ‌చ్చిన అనంత‌రం కొత్త ప్రాజెక్ట్ ల‌తో జోరు చూపిస్తున్నాడు. ప్ర‌స్తుతం `కామ్రేడ్ క‌ళ్యాణ్` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇది గాక మ‌రో రెండు ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసాడు. అయితే వాటి వివ‌రాలు గోప్యంగా ఉంచాడు.