Begin typing your search above and press return to search.

ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ తో బాధపడుతున్న రాజశేఖర్.. అంటే ఏంటో తెలుసా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Madhu Reddy   |   2 Nov 2025 10:51 AM IST
ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ తో బాధపడుతున్న రాజశేఖర్.. అంటే ఏంటో తెలుసా?
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన ఒక వైపు సినిమాలలో హీరోగా నటిస్తూనే మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈయన ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. విషయంలోకి వెళ్తే.. తాజాగా శర్వానంద్ హీరోగా నటిస్తున్న బైకర్ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న రాజశేఖర్ తాను బాధపడుతున్న సమస్య గురించి చెప్పి అభిమానులను బాధ పెట్టారు.

రాజశేఖర్ మాట్లాడుతూ.. "నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనే సమస్యతో బాధపడుతున్నాను. దీంతో ఏం స్పీచ్ ఇవ్వాలనే ఎక్సైట్మెంట్ తో నా కడుపులో సమస్య ఎక్కువైంది. దాంతో ఎలాగోలా మాట్లాడాను" అంటూ పేర్కొన్నారు. ఇకపోతే రాజశేఖర్ ఇలా ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనే సమస్యతో బాధపడుతున్నానని చెప్పడంతో అసలు ఏంటీ సమస్య? ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఏంటి ?అంటూ అభిమానులు కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఇదొక దీర్ఘకాలిక జీర్ణాశయాంతర సమస్య. ఈ సమస్య ఉన్న వారిలో మెదడు, పేగులు కలిసి పనిచేయవు. దీనివల్ల పేగుల్లో సున్నితత్వం పెరుగుతుంది. కడుపునొప్పి, విరోచనాలు, ఉబ్బరం, మలబద్ధకం, నిద్రలేమి , ఒత్తిడి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. రక్తం, మల పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం, ఫ్యాట్, ప్రాసెస్ ఫుడ్, ఎక్కువ కారం ఉండే ఫుడ్స్ కి దూరంగా ఉంటే ఈ సమస్యను అదుపు చేయవచ్చు. ఏది ఏమైనా రాజశేఖర్ ఇప్పుడు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే తమ హీరో ఇలాంటి సమస్య నుండి త్వరగా కోలుకోవాలని కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఇకపోతే ఈ బైకర్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఈయన మాట్లాడుతూ.. "దర్శకుడు ఈ గ్లింప్స్ ను నాకు ముందే చూపించి ఉంటే హీరో పాత్రని అడిగేవాడిని.. అంతా అయిపోయాక చూపించారు. ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే నటిస్తున్నాను" అంటూ తెలిపారు. అలాగే నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.."ఒక సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్తే.. మా ఫోటోగ్రాఫర్ రాకపోవడంతో అక్కడ ఫోటోగ్రాఫర్ ను తీసుకున్నాము. ఆయన ఫోటోలు తీస్తూ ఎన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు.. తర్వాత ఏం చేయబోతున్నారు.. అని అడిగాడు. అప్పటికే నేను సైన్ చేసిన ప్రాజెక్టుల గురించి చెబితే, మీరు చాలా లక్కీ అని అన్నాడు. ఎందుకు అని అడిగితే చేతినిండా పని ఉంది అని సమాధానం ఇచ్చాడు. అయితే అప్పుడు నాకు ఆ విషయం పెద్దగా అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతోంది. పని లేకపోతే జైల్లో ఉన్నట్లే" అంటూ తెలిపారు రాజశేఖర్. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.