2026-27 టాలీవుడ్.. బాక్సాఫీస్ షేకింగ్ ప్లాన్..!
కచ్చితంగా నేషనల్ వైడ్ గా ఈ సినిమాల గురించి కచ్చితంగా ఒక రేంజ్ బజ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.
By: Ramesh Boddu | 15 Dec 2025 8:00 PM ISTబాలీవుడ్ ని సైతం దాటేసి ఇండియన్ బాక్సాఫీస్ పై టాలీవుడ్ చేస్తున్న మాస్ డామినేషన్ తెలిసిందే. సౌత్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలు బీ టౌన్ ఆడియన్స్ కూడా పిచ్చెక్కిపోయే పరిస్థితి ఏర్పడింది. మన స్టార్స్ పాన్ ఇండియా సినిమాల ప్లానింగ్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఐతే నెక్స్ట్ రాబోతున్న రెండేళ్లు రిలీజ్ షెడ్యూల్ సినిమాలు చూస్తే బాక్సాఫీస్ మోత మోగించడం గ్యారెంటీ అనేలా ఉంది.
మరో ఇండస్ట్రీకి అసలు ఛాన్స్ లేని విధంగా..
మరో ఇండస్ట్రీకి అసలు ఛాన్స్ ఇచ్చేలా లేని విధంగా మన స్టార్స్ వచ్చే రెండేళ్ల ప్లానింగ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జనవరితో మొదలై ఇయర్ ఎండింగ్ వరకు భారీ సినిమాల రిలీజ్ లు ఉన్నాయి. అందులో మొదటిగా మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఇయర్ రెండు క్రేజీ సినిమాలతో రాబోతున్నారు. అందులో ఒకటి మన శంకర వరప్రసాద్ కాగా రెండోది విశ్వంభర. M.S.G తెలుగు రిలీజ్ మాత్రమే ఉన్నా విశ్వంభర మాత్రం పాన్ ఇండియా రిలీజ్ ఉంటుంది.
ఇక నెక్స్ట్ బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో NBK 111 సినిమా వస్తుంది. ఈ సినిమాను కూడా నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ షెడ్యూల్ చేసుకుంది. వీటితో పాటు ప్రభాస్ రాజా సాబ్ వచ్చే సంక్రాంతికి వస్తుండగా సెకండ్ హాఫ్ లో ఫౌజీ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
నాని ది ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్ది..
సో నెక్స్ట్ ఇయర్ రెబల్ ఫ్యాన్స్ కి రెండు సినిమాల ఫీస్ట్ అందించే ప్లానింగ్ లో ఉన్నాడు ప్రభాస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రాబోతుంది. ఈ సినిమాతో మరోసారి గబ్బర్ సింగ్ రికార్డులను టార్గెట్ పెట్టుకున్నారు హరీష్ శంకర్. నాని ది ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్ది కూడా నెక్స్ట్ ఇయర్ క్రేజీ సినిమాల లిస్ట్ లో ఉన్నాయి. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది.
2026 ఇలా ప్రతి సినిమా భారీ ప్లానింగ్ తో అంతకుమించిన అంచనాలతో వస్తుండగా 2027 బాక్సాఫీస్ హీట్ మరింత పెంచేలా స్టార్ సినిమాలు రాబోతున్నాయి.
ఇంటర్నేషనల్ లెవెల్ లో వారణాసి..
2027 లో కూడా మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబో సినిమా రిలీజ్ ప్లానింగ్ ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ కూడా ఆ ఇయర్ వస్తుంది. సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా 2027 సమ్మర్ రిలీజ్ అనే టాక్ ఉంది. ఈ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ఎంగేజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు జక్కన్న. ఇక వీటితో పాటు పెద్ది పూర్తి కాగానే సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుండగా ఆ సినిమాను 2027 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా 2027 లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలతో పాటు అట్లీ, అల్లు అర్జున్ కాంబో సినిమా కూడా అదే ఏడాది రిలీజ్ ఫిక్స్ చేశారు.
సో 2027 ప్రతి స్టార్ తమ పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ రేసులో దిగుతున్నారు. కచ్చితంగా నేషనల్ వైడ్ గా ఈ సినిమాల గురించి కచ్చితంగా ఒక రేంజ్ బజ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. 2027 తెలుగు సినిమాల బాక్సాఫీస్ సౌండ్ వరల్డ్ వైడ్ వినిపించేలా ఉంటుందని చెప్పొచ్చు.
