2025ని గ్రాండ్ గా ముగించేది ఆ ఇద్దరేనా?
బాలయ్య నుంచి రిలీజ్ అవుతున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
By: Srikanth Kontham | 26 Aug 2025 3:00 PM IST2025 అప్పుడే ఎనిమిది నెలలు పూర్తయింది. మరో నాలుగు నెలల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేస్తాం. మరి 2025ని గ్రాండ్ గా ముగించే టాలీవుడ్ హీరోలు ఎంత మంది అంటే? ఇద్దరు స్టార్లు మాత్రమే ప్రముఖంగా కనిపిస్తున్నారు. చెప్పుకోవడానికి చాలా మంది స్టార్లు ఉన్నారు? కానీ ఆ ఇద్దరు హీరోలపై మాత్రమే భారీ అంచనాలున్నాయి. వారిద్దరు ఎవరంటే నటసింహ బాలకష్ణ...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య `అఖండ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఒకే రోజు రెండు సినిమాలు:
బాలయ్య నుంచి రిలీజ్ అవుతున్న తొలి పాన్ ఇండియా చిత్రమిది. అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అన్ని పనులు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. సరిగ్గా ఇదే రోజున పవన్ కళ్యాణ్ కథానా యకుడిగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఓజీ` కూడా రిలీజ్ తేదీగా లాక్ అయింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగడం విశేషం.
వాళ్లతో పాటు వీళ్లు:
దీంతో ఈ రెండు చిత్రాల్లో ఏ హీరోది పై చేయి అవుతుంది? అన్న దానిపై ఇప్పటికే జోరుగా చర్చలు జరుగు తున్నాయి. ఇండస్ట్రీ కూడా ఈ రెండు సినిమాలపై చాలా ఆశలే పెట్టుకుంది. అసలే ఈ ఏడాది సరైన హిట్లు బాక్సాఫీస్ వద్ద నమోదు కానీ సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయన సినిమా లన్నీ చతికిల పడినవే. దీంతో 'అఖండ-2', 'ఓజీ'లపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలున్నా వాటిపై పెద్దగా బజ్ లేదు.సెప్టెంబర్ టూ డిసెంబర్ మద్య రవితేజ సహా పలువురు హీరోలు క్యూలో ఉన్నారు.
సీనియర్ల కంటే జూనియర్ బెటర్ గా:
కానీ వీళ్లందరికంటే ఉత్తమ స్థానంలో యంగ్ హీరో తేజ సజ్జా కనిపిస్తున్నాడు. 'మిరాయ్' తో పాన్ ఇండి యాలో రిలీజ్ లో ఉన్నాడు. `అఖండ 2`, `ఓజీ` తర్వాత బజ్ ఉన్న చిత్రంగా `మిరాయ్` హైలైట్ అవు తుంది. ఆ తర్వాత `డెకాయిట్`, `ఆంధ్రా కింగ్ తాలూకా` చిత్రాలున్నాయి. అనుష్క నటిస్తోన్న లేడీ ఓరియేంటెడ్ చిత్రం `ఘాటీ`పైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. `ఇడ్లీకడై`, `కాంతార చాప్టర్ 1` లాంటి చిత్రాలున్నా అవి రెండు పరభాషా చిత్రాలు కావడంతో తెలుగు సినిమాలకు పోటీ కాదు.
