Begin typing your search above and press return to search.

2026 లో 1000 కోట్ల తెలుగు సినిమా?

`బాహుబ‌లి`,` ఆర్ ఆర్ ఆర్`, `పుష్ప‌`, `క‌ల్కి 2898` లాంటి చిత్రాలు 1000 కోట్లకు పైగా వ‌సూళ్లు సాధించ‌డంతో? ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద టాలీవుడ్ యావ‌రేజ్ టార్గెట్ 2000 కోట్ల‌గా మారింది.

By:  Srikanth Kontham   |   16 Dec 2025 7:00 AM IST
2026 లో 1000 కోట్ల తెలుగు సినిమా?
X

1000 కోట్ల క్ల‌బ్ అన్న‌ది టాలీవుడ్ కి ఇప్పుడు కామన్ గా మారిన ప‌దం. `బాహుబ‌లి`,` ఆర్ ఆర్ ఆర్`, `పుష్ప‌`, `క‌ల్కి 2898` లాంటి చిత్రాలు 1000 కోట్లకు పైగా వ‌సూళ్లు సాధించ‌డంతో? ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద టాలీవుడ్ యావ‌రేజ్ టార్గెట్ 2000 కోట్ల‌గా మారింది. ఎస్ ఎస్ ఎంబీ 29 `వార‌ణాసి`, బ‌న్నీ 26వ చిత్రాలైతే? అంత‌కు మించే హైప్ తీసుకొ స్తున్నాయి. రెండు సినిమాల టార్గెట్ 3000 కోట్ల టార్గెట్ గా బ‌రిలోకి దిగుతున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే? 2025 లో మాత్రం టాలీవుడ్ నుంచి 1000 కోట్ల వ‌సూళ్ల సినిమా ఒక‌టీ లేదు.

సంక్రాంతి త‌ర్వాత అన్నీ చ‌ప్ప‌గానే

రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `గేమ్ ఛేంజ‌ర్` భారీ అంచ‌నాల మ‌ధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అయినా? ఆశించిన ఫ‌లితాలు రాలేదు. ఆ త‌ర్వాత మ‌రే చిత్రం కూడా ఆ రేంజ్ లో రిలీజ్ అవ్వ‌లేదు. చాలా సినిమాలు రీజ‌న‌ల్ మార్కెట్ కే ప‌రిమిత‌మ‌య్యాయి. వీటిలో పెద్ద విజ‌యం సాధించిన చిత్ర‌మేది? అంటే `సంక్రాంతికి వ‌స్తున్నాం` ఒక‌టి క‌నిపిస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 300 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ఇదేమీ పాన్ ఇండియా రిలీజ్ కాదు. రీజ‌న‌ల్ మార్కెట్ కే ప‌రిమిత‌మైన చిత్రం. అయినా వెంకీ ఇమేజ్ అనీల్ మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో? క‌నెక్ట్ అయింది.

ప్ర‌భాస్ రెండు సినిమాల‌తో:

మ‌రి 2026 లో టాలీవుడ్ నుంచి 1000 కోట్లు సాధించే స‌త్తా ఉన్న చిత్రాలేంటి? అంటే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న `పెద్ది`పై అంచ‌నాలున్నాయి. మార్చిలో ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. అంత‌కు ముం దే? డార్లింగ్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న `ది రాజాసాబ్` సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవుతుంది. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న స‌స్పెన్స్ కామెడీ థ్రిల్ల‌ర్ ఇది. ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప్రచారం ప‌నులు కూడా మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

పెద్ది, పౌజీపై అంచ‌నాలు:

మ‌రి ఈ సినిమా 1000 కోట్ల పోటీ బ‌రిలో ఉందా? అంటే ఇప్పుడే చెప్ప‌లేం. నార్త్ ఆడియ‌న్స్ కు కంటెంట్ క‌నెక్ట్ అవ్వ‌డాన్ని బ‌ట్టి ఉంటుంది. `పుష్ప‌`లా కనెక్ట్ అయిందంటే? మాత్రం వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ మోతెక్క‌డం ఖాయం. అదే ఏడాది ప్ర‌భాస్ న‌టిస్తోన్న `పౌజీ` కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తో న్న చిత్ర‌మిది. ఇదోక పీరియాడిక్ యాక్ష‌న్ చిత్రం కావ‌డంతో? ఇండియా వైడ్ అంచ‌నాలైతే భారీగా ఉన్నాయి.`పెద్ది`ని మించిన అంచ‌నాలు `పౌజీ`పై ఉన్నాయి.

గ‌త గణాంకాలు ఆధారంగా:

యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్ కావ‌డంతో? బ‌జ్ నెల‌కొంది. భారీ వార్ క‌థ‌లోనే ఓ బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరీని కూడా తీసుకు న్నాడు. `సీతారామం` లాంటి పాన్ ఇండియా స‌క్సెస్ కూడా హ‌ను ఖాతాలో ఉన్న నేప‌థ్యంలో అంచ‌నాలు రెట్టింపు అవుతు న్నాయి. అయితే టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతోన్న ఏ పాన్ ఇండియా సినిమా అయినా? నార్త్ బెల్ట్ నుంచి క‌చ్చితంగా 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌డితే? 1000 కోట్ల క్ల‌బ్ అన్న‌ది సాధ్య‌మ‌ని గ‌త సినిమా గ‌ణాంకాలు చెబుతున్నాయి.