జపాన్ గడ్డపై తొలిసారి కాలు మోపుతోన్న స్టార్!
జపాన్ దేశంలో షూటింగ్ లు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కథలు డిమాండ్ చేస్తే తప్ప జపాన్ లో షూటింగ్ అన్నది అంత సులభంగా జరగదు.
By: Srikanth Kontham | 3 March 2026 2:00 PM ISTజపాన్ దేశంలో షూటింగ్ లు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కథలు డిమాండ్ చేస్తే తప్ప జపాన్ లో షూటింగ్ అన్నది అంత సులభంగా జరగదు. విదేశాల్లో షూటింగ్ చేయాల్సి వస్తే ఎక్కువగా అమెరికా, ఇటలీ, లాంటి దేశాల్లోనే షూటింగ్ చేస్తుంటారు. భారీ వార్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు చిత్రీకరించాలంటే బల్గేరియాకు వెళ్లిపోతుంటారు.బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ఇప్పటివరకు ఏ సినిమా షూటింగ్ కోసం జపాన్ గడ్డపై అడుగు పెట్టలేదు అంటే నమ్ముతారా? అవును. ఇంత వరకూ టైగర్ ష్రాప్ షూటింగ్ కోసం జపాన్ వెళ్లింది లేదు.
ఆయన సినిమాలు ఎక్కువగా థాయిలాండ్, సెర్బియా, మొరాకో , యూరప్ దేశాల్లో చిత్రీకరణ జరుపుకున్నాయి. టైగర్ ష్రాప్ నటించిన `బాఘీ 2` ,` భాఘీ 3` షూటింగ్ థాయిలాండ్ సెర్బియాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించారు. అలాగే `వార్` సినిమా షూటింగ్ అంతా ఇటలీ, పోర్చుగల్ , ఫిన్లాండ్ వంటి దేశాల్లోనే జరిగింది. జపాన్ లో కొన్ని సీన్స్ చిత్రీకరిద్దాం అనుకున్నారు గానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసారు. అలాగే `గణపత్` చిత్రం ప్రధానంగా యునైటెడ్ కింగ్‌డమ్ చిత్రీకరించారు. అలాగే `ర్యాంబో` ని రీమేక్ చేయాలనుకున్నారు.
ఈ క్రమంలో టైగర్ ష్రాప్ పై కొన్ని సన్నివేశాలను జపాన్ లో చిత్రీకరించాలని భావించారు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇంకా మొదలవ్వలేదు. తాత్కాలికంగా ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. జపాన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే, జుజుట్సు అంటే టైగర్ ష్రాఫ్‌కు చాలా ఇష్టం. ఆయన తన సినిమాల్లో ఉపయోగించే అనేక ఫైట్ మాస్టర్స్ జపాన్ లేదా చైనా నుండి వచ్చిన టెక్నిక్స్‌ను అనుసరిస్తుంటారు. షూటింగ్ జరగకపోయినా, ఆయన యాక్షన్ స్టైల్‌లో జపాన్ ప్రభావం కనిపిస్తుంది. అలా ఎంతో కాలంగా జపాన్ అంటే టైగర్ ష్రాప్ కి ప్రత్యేక అభిమానంగా మిగిలిపోయింది తప్ప! జపాన్ లో షూటింగ్ చేయలేకపోయారు.
అయితే ఇంత కాలానికి ఆ కోరిక తీరబోతుంది. రామ్ మద్వానీ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రాజెక్ట్ ను అధికారికంగానూ వెల్లడించారు. ఈసినిమాకు `వజ్ర` అనే టైటిల్ ను నిర్ణయించారు. ఆధ్యాత్మిక యాక్షన్ థ్రిల్లర్ గా భారతీయ సంస్కృతితో ముడిపడిన కథగా చెప్ప బోతున్నారు. ఈ ఏడాదిలో మిడ్ నుంచి షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా షూటింగ్ ప్రారంభోత్సవం జపాన్ లో నిర్వహిం చడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కి సంబంధించిన అనుమతులు కూడా లభించినట్లు సమాచారం. ఈ చిత్రంలో టైగర్ పాత్ర మునుపెన్నడు చూడని విధంగా, సరికొత్తగా ఉండబోతుందని సమాచారం.
