Begin typing your search above and press return to search.

మ‌రోసారి అదే ద‌ర్శ‌కుడ్ని రిపీట్ చేస్తోన్న స్టార్!

స‌క్సెస్ పుల్ కాంబినేష‌న్స్ నిరంత‌రం రిపీట్ అవుతూనే ఉంటాయి. అలాంటి క‌ల‌యిక‌లు ప్ర‌యోగానికి ఎంత మాత్రం వెన‌క‌డ‌గు వేయ‌రు.

By:  Srikanth Kontham   |   19 Jan 2026 8:15 AM IST
మ‌రోసారి అదే ద‌ర్శ‌కుడ్ని రిపీట్ చేస్తోన్న స్టార్!
X

స‌క్సెస్ పుల్ కాంబినేష‌న్స్ నిరంత‌రం రిపీట్ అవుతూనే ఉంటాయి. అలాంటి క‌ల‌యిక‌లు ప్ర‌యోగానికి ఎంత మాత్రం వెన‌క‌డ‌గు వేయ‌రు. ప్ర‌ముఖంగా సీనియ‌ర్ హీరోలు కాంబినేష‌న్స్ కి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో కంప్లీట్ స్టార్ మోహ‌న్ లాల్- త‌రుణ్ మూర్తి మ‌రోసారి చేతులు క‌లిపారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో గ‌త ఏడాది రిలీజ్ అయిన `తుడ‌రుమ్` బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. `ఎల్ 2` తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న అనంత‌రం మోహ‌న్ లాల్ ఖాతాలో ప‌డిన మ‌రో విజ‌యం అది. ట్యాక్సీ డ్రైవర్ అయిన షణ్ముగం (మోహన్ లాల్) చుట్టూ తిరుగుతుంది.

సంతోషంగా సాగుతున్న అతని జీవితం అనుకోని సంఘటనతో తారుమార‌వుతుంది. ఓ హత్య కేసులో ఇరుక్కోవడం, ఆ తర్వాత తన కొడుకు కనిపించకుండా పోవడం? వంటి సంఘటనలతో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ట్యాక్సీ డ్రైవ‌ర్ పాత్ర‌లో మోహ‌న్ లాల్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నారు. విమ‌ర్శ‌కుల్ని సైతం మెప్పించిన చిత్రంగా నిలిచింది. క‌మ‌ర్శియ‌ల్ గా మంచి వసూళ్ల‌ను సాధించింది. 30 కోట్ల బ‌డ్జెట్ లో నిర్మించిన సినిమా 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. దీంతో మోహ‌న్ లాల్ మ‌రోసారి త‌రుణ్ మూర్తితో ముంద‌కెళ్ల‌డానికి రెడీ అయ్యారు.

`ఎల్ 365` వ‌ర్కింగ్ టైటిల్ తో సినిమాను ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అవుతున్నారు. ఈనెల 23న చిత్రం ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని మునుప‌టి చిత్రం కంటే భారీగా తీర్చిదిద్దుతున్నార‌ని మోహ‌న్ లాల్ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. ఈనేప‌థ్యంలో త‌రుణ్ మూర్తి ఎలాంటి క‌థాంశాన్ని ఎంచుకున్నాడు? అందులో మోహ‌న్ లాల్ ని ఎలా ప్ర‌జెంట్ చేస్తారు? అనే చ‌ర్చ అప్పుడే మొద‌లైపోయింది. ప్ర‌స్తుతం మోహ‌న్ లాల్ హీరోగా రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న `పేట్రియాట్` ఆన్ సెట్స్ లో ఉంది.

`రామ్` అనే మ‌రో చిత్రం షూటింగ్ నెమ్మ‌దిగా జ‌రుగుతుంది. వాస్త‌వానికి ఈ రెండు సినిమాలు గ‌త ఏడాదే రిలీజ్ అవ్వాలి. కానీ షూటింగ్ డిలేతో ఆల‌స్య‌మవు తున్నాయి. ఈ ఏడాది ప్ర‌ధ‌మార్ధంలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. అలాగే `దృశ్యం 3` షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారా? రీజ‌న‌ల్ మార్కెట్ కే ప‌రిమితం చేస్తారా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. వీట‌న్నింటికి అతి త్వ‌ర‌లోనే మేక‌ర్స్ నుంచి క్లారిటీ రానుంద‌ని స‌న్నిహితుల స‌మాచారం.