Begin typing your search above and press return to search.

ఈ వారం కొత్త రిలీజులివే!

మ‌రో వారం వ‌చ్చేసింది. ప్ర‌తీ వారం లానే ఈ వారం కూడా కొన్ని కొత్త సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుండ‌గా, మ‌రికొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లోకి రానున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 Nov 2025 11:51 AM IST
ఈ వారం కొత్త రిలీజులివే!
X

మ‌రో వారం వ‌చ్చేసింది. ప్ర‌తీ వారం లానే ఈ వారం కూడా కొన్ని కొత్త సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుండ‌గా, మ‌రికొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లోకి రానున్నాయి. గ‌త వారం ది గ‌ర్ల్‌ఫ్రెండ్, జ‌టాధ‌ర‌, ప్రీ వెడ్డింగ్ షో లాంటి సినిమాలు రిలీజ‌వగా, ఈ వారం ప‌లు ఇంట్రెస్టింగ్ మూవీస్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. వాటిలో ముందుగా థియేట‌ర్ల‌లో ఏ సినిమాలు రిలీజ‌వుతున్నాయో చూద్దాం.

దుల్క‌ర్ మూవీ కాంత‌

దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా, స‌ముద్ర‌ఖ‌ని, రానా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా కాంత‌. సెల్వ‌మ‌ణి సెల్వరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ న‌వంబ‌ర్ 14న రిలీజ్ కానుండ‌గా, ఇప్ప‌టికే రిలీజైన కాంత ట్రైల‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

న‌వంబ‌ర్ 14న సంతాన ప్రాప్తిర‌స్తు

ఈ జెన‌రేష‌న్ ఎదుర్కొంటున్న సంతాన‌లేమి స‌మ‌స్యను ప్ర‌ధానాంశంగా తీసుకుని డైరెక్ట‌ర్ సంజీవ్ రెడ్డి తెర‌కెక్కించిన సంతాన ప్రాప్తిర‌స్తు కూడా న‌వంబ‌ర్ 14 వ తేదీనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విక్రాంత్, చాందినీ చౌద‌రి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో వెన్నెల కిషోర్, త‌రుణ్ భాస్క‌ర్, అభిన‌వ్ గోమ‌టం కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా, ఆల్రెడీ రిలీజైన ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రానున్న సీమంతం

వ‌జ్ర‌యోగి హీరోగా శ్రేయ భ‌ర్తీ హీరోయిన్ గా సుధాక‌ర్ పాణి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన సినిమా సీమంతం. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో రూపొందిన ఈ మూవీని ప్ర‌శాంత్ టాటా నిర్మించ‌గా, న‌వంబ‌ర్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. గ‌ర్భిణుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ క‌థ చాలా డిఫ‌రెంట్ గా ఉంటూనే ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్ర యూనిట్ చెప్తోంది.

నవ్వుల‌తో పాటూ ఎమోష‌న్ కూడా

హ‌రీష్ రెడ్డి ఉప్పుల ద‌ర్శ‌క‌త్వంలో కృష్ణ బురుగుల‌, మ‌ణి వ‌క్కా, ధీర‌జ్ ఆత్రేయ‌, రామ్ నితిన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన మూవీ జిగ్రీస్. కృష్ణ వోడ‌ప‌ల్లి నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ న‌వంబ‌ర్ 14న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ సినిమా న‌వ్విస్తూనే ఆడియ‌న్స్ ను ఎమోష‌న్ కు గురి చేస్తోంద‌ని చిత్ర మేక‌ర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

టాలీవుడ్ క‌ల్ట్ మూవీ రీరిలీజ్

వీటితో పాటూ టాలీవుడ్ క‌ల్ట్ మూవీ శివ కూడా న‌వంబ‌ర్ 14న రీరిలీజ్ కానుంది. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగో తెర‌కెక్కిన ఈ మూవీ 1989లో రిలీజై మంచి హిట్ గా నిల‌వ‌గా, ఇప్పుడీ సినిమాను 4కె డాల్బీ అట్మాస్ వెర్ష‌న్ లో రీమాస్ట‌ర్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ తెలుగు సినిమాల‌తో పాటూ బాలీవుడ్ నుంచి దే దే ప్యార్ దే2 కూడా న‌వంబ‌ర్ 14నే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. 2019లో రిలీజైన రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ దే దే ప్యార్ దే సినిమాకు సీక్వెల్ గా వ‌స్తున్న ఈ మూవీలో అజ‌య్ దేవ‌గ‌ణ్, ర‌కుల్ ప్రీత్ సింగ్, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇక ఇవి కాకుండా ప‌లు సినిమాలు, వెబ్‌సిరీస్ లు కూడా ఓటీటీలో ఆడియ‌న్స్ కు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో ఏయే ప్లాట్‌ఫామ్ లో ఏ కంటెంట్ రిలీజవుతుందో చూద్దాం. ముందుగా

నెట్‌ఫ్లిక్స్‌లో..

డ్యూడ్ అనే తెలుగు సినిమా

దిల్లీ క్రైమ్ అనే వెబ్‌సిరీస్ సీజ‌న్3

మెరైన్స్ అనే వెబ్‌సిరీస్

ప్రైమ్ వీడియోలో..

ప్లే డేట్ అనే సినిమా

జియో హాట్‌స్టార్‌లో..

జాలీ ఎల్ఎల్‌బీ అనే బాలీవుడ్ మూవీ

జీ5లో..

ఇన్‌స్పెక్ష‌న్ బంగ్లా అనే మ‌ల‌యాళ వెబ్‌సిరీస్

మ‌నోర‌మా మ్యాక్స్‌లో..

క‌ప్లింగ్ అనే మ‌ల‌యాళ మూవీ