Begin typing your search above and press return to search.

ఈ వారం అలరించనున్న ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు!

సాధారణంగా థియేటర్లలో ఎన్ని సినిమాలు విడుదలైనా సరే.. అందులో కొన్ని మళ్లీ చూడాలనే సినిమాలు ఉంటాయి.

By:  Madhu Reddy   |   18 Feb 2026 10:33 AM IST
ఈ వారం అలరించనున్న ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు!
X

సాధారణంగా థియేటర్లలో ఎన్ని సినిమాలు విడుదలైనా సరే.. అందులో కొన్ని మళ్లీ చూడాలనే సినిమాలు ఉంటాయి. అయితే మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వెళ్లి చూడలేని పరిస్థితి ప్రతి ఒక్కరిది. అందుకే ఇటు థియేటర్ కి మళ్ళీ వెళ్లాలనుకునే ఆడియన్స్ కోసం.. అసలు థియేటర్ కు వెళ్లలేని ఆడియన్స్ కోసం కూడా ఇప్పుడు ఓటీటీలు సిద్ధమయ్యాయి. గత 6 సంవత్సరాలుగా కరోనా వచ్చినప్పటి నుంచి ఈ ఓటీటీలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఓటీటీలే సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నాయి అనే కామెంట్ కూడా వ్యక్తం అవుతోంది. అలాంటి ఈ ఓటీటీలు ఈ వారం కూడా కొన్ని చిత్రాలను, వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమయ్యాయి. మరి విభిన్న జానర్లలో సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కోసం ఓటీటీలోకి ఈ వారం అలరించడానికి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

నెట్ ఫ్లిక్స్:

మై పెంగ్విన్ ఫ్రెండ్ (హిందీ డబ్బింగ్) - ఫిబ్రవరి 16

ద లెటర్ ఆఫ్ ద డే (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 16

స్కిన్ కేర్ (ఇంగ్లీష్ ) - ఫిబ్రవరి 16

వైట్ బర్డ్ (ఇంగ్లీష్ మూవీ ) - ఫిబ్రవరి 16

చథా పచ్చ (తెలుగు డబ్బింగ్) - ఫిబ్రవరి 19

ద నైట్ ఏజెంట్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ) - ఫిబ్రవరి 19

స్ట్రిస్ లా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ) - ఫిబ్రవరి 20

అమెజాన్ ప్రైమ్ వీడియో :

56 డేస్ (ఇంగ్లీషు వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 18

హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ్ ) - ఫిబ్రవరి 20

ఈటీవీ విన్ :

శ్రీ చిదంబరం గారు (తెలుగు )

జియో హాట్ స్టార్ :

లక్కీ : ది సూపర్ స్టార్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 20

ఆహా

హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ్ మూవీ ) - ఫిబ్రవరి 20

జి ఫైవ్ :

కెన్నెడీ (హిందీ) - ఫిబ్రవరి 20

ఆపిల్ టీవీ ప్లస్ :

ద లాస్ట్ థింగ్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 19