మిస్ అయిన మెమరీ కార్డుతో తిప్పలు.. ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్ చూశారా?
వర్సటైల్ యాక్టర్ తిరువీర్.. జార్జిరెడ్డి, పలాస 1978, మసూద సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 29 Oct 2025 11:15 AM ISTవర్సటైల్ యాక్టర్ తిరువీర్.. జార్జిరెడ్డి, పలాస 1978, మసూద సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. సోలో హీరోగా ఆడియన్స్ ను అలరిస్తున్నారు. ఇప్పుడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో నటిస్తున్నారు. కంప్లీట్ కామెడీ డ్రామాగా ఆ సినిమా రూపొందుతోంది.
రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రీ వెడ్డింగ్ షో చిత్రంలో తిరువీర్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ గా కనిపించబోతున్నారు. ఆయన సరసన టీనా శ్రావ్య హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా టీజర్ రాగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. వెడ్డింగ్ షోలో ప్రతి ఫ్రేమ్ వినోదాన్ని అందించేలా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.
అయితే నవంబర్ 7వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. మేకర్స్ రీసెంట్ గా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఈవెంట్ ను నిర్వహించి ట్రైలర్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రీ వెడ్డింగ్ షో మూవీ ట్రైలర్ ఫుల్ వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుని సందడి చేస్తోంది.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. తిరువీర్ తాను ఉంటున్న చుట్టుపక్కల గ్రామాల్లో బెస్ట్ వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ గా అనిపించుకుంటారు. ఓ జంటకు ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించగా, ఆ కంటెంట్ ఉన్న మెమరీ కార్డు మిస్ అవుతుంది. దీంతో వాళ్ళకు పిక్స్, వీడియోస్ ఇవ్వలేకపోతారు. అందుకు గాను నానా పాట్లు కూడా పడుతుంటారు!
అదే సమయంలో అప్పటికే హీరోయిన్ తో లవ్ లో ఉంటారు. అలా ట్రైలర్ లో లవ్ స్టోరీ కూడా చూపించారు మేకర్స్. చివరకు ఏమైందనేది సినిమాగా తెలుస్తోంది. అయితే సినిమా అంతా ట్విస్టులు, నవ్వులతో ఉండనున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. మంచి కంటెంట్ తోనే మూవీని రూపొందించినట్లు అనిపిస్తుంది.
అయితే ట్రైలర్ లో తిరువీర్ మరోసారి సెటిల్డ్ గా కనిపించారు. పక్కింటి అబ్బాయిలా అనిపించారు. హీరోయిన్ టీనా శ్రావ్య.. పల్లెటూరి అమ్మాయిగా సెట్ అయ్యారు. మాస్టర్ రోహన్ తన కామెడీతో మరోసారి అలరించేలా కనిపిస్తున్నాడు. విజువల్స్ చాలా నాచురల్ గా ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆసక్తి రేపుతోంది.
ఇక ప్రీ వెడ్డింగ్ షో మూవీ విషయానికొస్తే.. పీఎం ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతంతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందిస్తున్నారు. కె.సోమ శేఖర్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నరేష్ అడుప ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది. మరి ది గ్రేట్ వెడ్డింగ్ షో మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
