ది గర్ల్ ఫ్రెండ్ -జటాధర -ప్రీ వెడ్డింగ్ షో.. మధ్య రిలేషన్ పై హీరో క్లారిటీ!
ప్రముఖ యంగ్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా.. 90's బయోపిక్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.
By: Madhu Reddy | 6 Nov 2025 3:33 PM ISTప్రముఖ యంగ్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా.. 90's బయోపిక్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నవంబర్ 7వ తేదీన చాలా గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతోంది. 7PM బ్యానర్ పై సందీప్, అశ్వితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మీడియా మిత్రుల కోసం నిన్న రాత్రి హైదరాబాదులో ప్రీమియర్ షో వేయగా.. షో అనంతరం వచ్చిన రివ్యూలు.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం మాత్రమే కాదు మనసుకు హత్తుకునే చిత్రమని కచ్చితంగా ఫ్యామిలీ లేదా స్నేహితులతో ఎవరితో చూసినా సరే ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా తాజాగా రేపు థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. అందులో భాగంగానే రేపు ఈ చిత్రంతోపాటు విడుదల కాబోతున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతోపాటు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న జటాధరా సినిమా కూడా రేపే థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూడు చిత్రాలకి ఉన్న రిలేషన్ ని హీరో తిరువీర్ చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రెస్ మీట్ లో భాగంగా తిరువీర్ మాట్లాడుతూ.." ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీని ప్రసాద్ ల్యాబ్ లో చూసిన దానికంటే.. జర్నలిస్టుల మధ్యలో సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసాము. ముఖ్యంగా జర్నలిస్టులు అంటే థియేటర్లో సినిమాను చూసి.. నవ్వు వచ్చినా.. ఎమోషన్ ఏదైనా సరే దాచుకొని.. సీరియస్ గా సినిమా చూస్తారని అంటారు. కానీ ఈ సినిమా చూసేటప్పుడు జర్నలిస్టులు అందరూ తమ సీట్లలో నుంచి పైకి లేచి మరీ నవ్వడం చూసి నేనే ఆశ్చర్యపోయాను. వెంటనే టీనా , రోహన్ తో చెప్పేసాను మన సినిమా హిట్ అని.. ఇక డైరెక్టర్ ఈ సినిమా గురించి ఏదైతే చెప్పారో అదే సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. నిన్న రివ్యూ చూసిన తర్వాత కూడా అందరూ ఆ క్యారెక్టర్లలో లీనమైపోయి నటించారు. ఆ పాత్రలలో ఇంకొకరిని ఊహించుకోవడం చాలా కష్టమని.. అద్భుతమైన కాస్టింగ్ ఎంచుకున్నారని చెప్పడంతో నాకు మరింత సంతోషంగా అనిపించింది". అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
అలాగే రేపు విడుదల కాబోతున్న జటాధర, ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాల మధ్య రిలేషన్ గురించి మాట్లాడుతూ.. "ప్రీమియర్ షో చూసిన తర్వాత ఈరోజు ఉదయం మొబైల్ ఆన్ చేయగానే నాకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ నుండి నాకు మెసేజ్ వచ్చింది. కంగ్రాట్యులేషన్స్ అంటూ.. ఆయన చెప్పడంతో ఇక ఒక్కసారిగా నా ఆనందానికి అవధులు లేవు.. కోఇన్సిడెంట్ అనాలో ఏమనాలో నాకు తెలియదు. కానీ ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి రాహుల్ రవీంద్రన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కి రాహుల్ శ్రీనివాస్.. "రాహుల్ రవీంద్రన్ - రాహుల్ శ్రీనివాస్".. ఇదొక్కటైతే.. జటాధర చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకట్ కళ్యాణ్ , నేను షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మా ముగ్గురు సినిమాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. ముగ్గురు సినిమాలు బాగా ఆడాలి. ఇండస్ట్రీ బాగుండాలి" అంటూ ఈ మూడు చిత్రాల మధ్య బంధాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
