Begin typing your search above and press return to search.

ఒక్క మెసేజ్ తో అంతా వచ్చారు.. ఎప్పటికీ గుర్తుంచుకుంటా: తిరువీర్

టాలీవుడ్ యువ నటుడు తిరువీర్.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

By:  M Prashanth   |   28 Oct 2025 3:00 PM IST
ఒక్క మెసేజ్ తో అంతా వచ్చారు.. ఎప్పటికీ గుర్తుంచుకుంటా: తిరువీర్
X

టాలీవుడ్ యువ నటుడు తిరువీర్.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు హీరోగా అలరిస్తున్నారు. తెలంగాణకు చెందిన తిరువీర్.. మసూద మూవీతో స్పెషల్ ఫేమ్ సొంతం చేసుకున్నారు. ఆ సినిమాతో పాటు ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, మసూద, పరేషాన్, మోక్షపటం వంటి సినిమాలు చేశారు.

ఇప్పుడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో నటిస్తున్నారు. కంప్లీట్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ మూవీకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యంగ్ ప్రొడ్యూసర్ సందీప్ నిర్మిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుండగా.. మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అందులో తిరువీర్ మాట్లాడారు.

అయితే తిరువీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడిన వీడియో చక్కర్లు కొడుతోంది. "పదేళ్ల క్రితం ఆఫీస్ ఆఫీస్ తిరిగి ఆడిషన్స్ ఇచ్చేవాడిని. ఓ నాటకం చూసి కరుణ గారు నాకు పలాసలో ఛాన్స్ ఇచ్చారు. ఆ ఆడిషన్ చూసి రూపక్ గారు పరేషన్ లో అవకాశం ఇచ్చారు" అని తిరువీర్ తెలిపారు.

"నేటి ఈవెంట్ కోసం ఎవరినీ కాల్ చేయలేదు. మెసేజ్ పెడితే ఇంత మంది డైరెక్టర్స్ వచ్చారు. నేనెప్పటికైనా డల్ అయినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే.. ఇది గుర్తు పెట్టుకుంటా. ఏం సాధించా అంటే.. ఒక మెసేజ్ తో ఫ్రెండ్స్ ను, డైరెక్టర్ ను సంపాదించుకున్నానని గుర్తుంచుకుంటా. అందరినీ పేరుపేరునా థ్యాంక్స్" అంటూ అభిమానాన్ని చాటుకున్నారు.

"కొత్త ప్రొడ్యూసర్, డెబ్యూటంట్ డైరెక్టర్.. చాలా మంది కొత్త నటులే. వారందరికీ సపోర్ట్ చాలా అవసరం. ఆ ప్రొడ్యూసర్ నిలబడి మరో సినిమా చేయాలంటే మూవీ ఆడడం అవసరం. ఓ రిస్క్ చేసి.. మూవీకి ఎంత పెడితే ఎంత వస్తుంది.. అనే మాటలు జరుగుతున్న టైమ్ లో ఒకతనకి సినిమా చేద్దాం అని మాట ఇచ్చి.. దాన్ని నిలబెట్టి ఇంతవరకు మూవీ తెచ్చాడు సందీప్" అని చెప్పారు.

"అయితే ప్రీ వెడ్డింగ్ షో మూవీ షూట్ చేసినంత సేపు సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నాం అనే ఫీల్ రాలేదు. అరకు వెళ్ళాం. 70 మంది కలిసి వెళ్ళాం. వంట చేసుకున్నాం. తిన్నాం. ఆడుకున్నాం.. పడుకున్నాం.. సైట్ సీయింగ్ కు వెళ్ళాం. సినిమా సీన్స్ ను షూట్ చేశాం. ఆ తర్వాత వచ్చేశాం. చాలా సరదాగా జరిగింది" అని వెల్లడించారు తిరువీర్.