Begin typing your search above and press return to search.

ఓజీ ట్రైలర్: పవన్ కళ్యాణ్ ఊచకోత.. తలలు జాగ్రత్త!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న OG సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  M Prashanth   |   22 Sept 2025 2:33 PM IST
ఓజీ ట్రైలర్: పవన్ కళ్యాణ్ ఊచకోత.. తలలు జాగ్రత్త!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న OG సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. DVV దానయ్య నిర్మాణం నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఇదివరకే వచ్చిన అప్డేట్స్ ద్వారా ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో సినిమా ట్రైలర్ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు.

ఇక ఎట్టకేలకు ఆదివారం సినిమా ఈవెంట్లో చాలామంది ఫాన్స్ డైరెక్ట్ గా ట్రైలర్ చూశారు. ఇక కొద్ది సేపటి క్రితం యూట్యూబ్ లో అందరూ చూసేలా ఆ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ తో సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి. ముఖ్యంగా తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆయుధంలా కనిపిస్తోంది.

సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ప్రజెంట్ చేసినట్లుగా కూడా అర్థమవుతుంది. గన్స్ మాఫియా డీల్స్ నేపథ్యంలో సినిమా పవర్ఫుల్ కంటెంట్ తో ఉంటుంది అని దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఒకప్పుడు ముంబైలో ఊచకోత కోసిన ఓజాస్ గంభీర అజ్ఞాతంలోకి వెళ్లి ఫ్యామిలీతో ఉండడం, ఆ తరువాత మళ్ళీ అతని కోసం శత్రువులు మాఫియా సామ్రాజ్యం ఎదురుచూడడం వంటి అంశాలు సినిమా స్పాన్ ను తెలియజేస్తున్నాయి.

ఇక అలాంటోడు మళ్లీ ముంబైలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది అనే హుక్ పాయింట్ క్యూరియసిటిని క్రియేట్ చేస్తోంది. ముంబై వస్తున్నాను..తలలు జాగ్రత్త.. అనే డైలాగ్ తోనే హీరో క్యారెక్టర్ గా హై వోల్టేజ్ గా ఉండబోతున్నట్లు కూడా అర్థమవుతుంది. ఇక అతని చేతిలో కత్తి, విలన్స్ ను ఊచకోత కోయడం కూడా మరొక లెవెల్ లో ఉంటుంది అని రెండు మూడు సన్నివేశాలతోనే క్లారిటీ ఇచ్చేశారు.

సినిమా లో ముఖ్యంగా విలన్స్ గ్యాంగ్స్ ని కూడా చాలా గ్రాండ్ గా చూపించినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో ఒక మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక అతనికి సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా డిఫరెంట్ గా ఉంది. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే బ్యాక్ డ్రాప్ కథ కూడా ప్రధాన ఆయుధంగా కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ గతంలో చేసిన పంజా కంటే ఇది ఇంకాస్త హై లెవెల్ లో ఉంటుందని కూడా అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాలు చేయలేదు దీంతో ఫ్యాన్స్ ఇలాంటి సీన్స్ కోసమే ఎదురు చూస్తూఉన్నారు. ఇక ట్రైలర్ ద్వారా అయితే సినిమా అంచనాల స్థాయిని పెంచేలా కనిపిస్తోంది. ఇక సినిమా కంటెంట్ కూడా ఆ స్థాయికి తగ్గట్టు ఉంటే బాక్సాఫీస్ వద్ద మళ్లీ పవన్ కళ్యాణ్ దండయాత్ర మొదలుపెట్టడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.