Begin typing your search above and press return to search.

OG ప్రమోషనల్ స్ట్రాటజీ ప్లాన్ ఏంటి..?

ఐతే రిలీజ్ ఇంకా 15 రోజులు మాత్రమే ఉన్న టైం లో ఓజీ సినిమా ప్రమోషనల్ ప్లానింగ్ గురించి ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. పాన్ కళ్యాణ్ కూడా ఓజీ ప్రమోషన్స్ కి టైం ఇస్తానని చెప్పారట.

By:  Ramesh Boddu   |   10 Sept 2025 8:00 PM IST
OG ప్రమోషనల్ స్ట్రాటజీ ప్లాన్ ఏంటి..?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పవర్ స్టార్ స్టామినా పాన్ ఇండియా లెవెల్ లో చూపించబోతున్నారు. సాహో తర్వాత సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఓజీ సినిమాలో పవర్ స్టార్ స్వాగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఓజీ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాకు అతను పెద్ద అసెట్ అయ్యేలా ఉన్నాడు.

రిలీజ్ ఇంకా 15 రోజులు మాత్రమే..

ఐతే రిలీజ్ ఇంకా 15 రోజులు మాత్రమే ఉన్న టైం లో ఓజీ సినిమా ప్రమోషనల్ ప్లానింగ్ గురించి ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. పాన్ కళ్యాణ్ కూడా ఓజీ ప్రమోషన్స్ కి టైం ఇస్తానని చెప్పారట. ఐతే సుజిత్ అండ్ టీం సినిమాను బాగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు థమన్ కూడా తన సపోర్ట్ ఇస్తానని అన్నాడు. ఓజీ సినిమా మ్యూజిక్ పరంగా థమన్ ది బెస్ట్ ఇచ్చాడని అనిపిస్తుంది.

ఐతే ప్రమోషన్స్ లో కూడా థమన్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారని టాక్. డైరెక్టర్, థమన్ ఓజీ గురించి ఒక స్పెషల్ చిట్ చాట్ చేస్తారట. అంతేకాదు మిగతా ప్రమోషనల్ ప్లాన్స్ కూడా చేస్తున్నారట. రెండు నెలల క్రితం రిలీజైన పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాకు ఎలాగైతే పవన్ కళ్యాణ్ టైం కేటాయించాడో ఓజీ సినిమాకు కూడా రిలీజ్ ముందు రెండు రోజులు టైం ఇస్తారని టాక్.

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్..

ఓజీ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేస్తాడట. ప్రమోషన్స్ తోనే సినిమా ష్యూర్ షాట్ హిట్ అనే రేంజ్ బజ్ ని అందిస్తారట. డివివి దానయ్య నిర్మించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ జాతరకి రెడీ అవుతుంది. సుజిత్ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.

ఓజీలో సాంగ్స్ మాత్రమే కాదు బిజిఎం కూడా థమన్ తడాఖా చూపించేలా ఉన్నాడు. సెప్టెంబర్ 25 దసరా హాలీడేస్ లో వస్తున్న ఓజీ భారీ రికార్డుల మీద కన్నేసింది. తప్పకుండా ఈ సినిమా మరోసారి పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిస్తుందని అంటున్నారు. ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు ట్రెండ్ సృష్టించడమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుసు. ఓజీ తో సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడతారని టాక్. సుజిత్ కూడా పవర్ స్టార్ ఫ్యాన్ అవ్వడం వల్ల ఒక అభిమానిగా ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా ఓజీలో పవర్ స్టార్ ని చూపిస్తున్నాడని టాక్.