ఎక్స్ క్లూజివ్: ఈ వీక్ మూవీ రిపోర్ట్ ఎలా ఉందంటే?
ఈ వారంలో థియేటర్లలోకి వచ్చిన సినిమాలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కొత్త కంటెంట్ చూసిన తర్వాత ఒక విషయం క్లియర్ గా తెలుస్తోంది.
By: M Prashanth | 20 Jun 2026 4:50 PM ISTఈ వారంలో థియేటర్లలోకి వచ్చిన సినిమాలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కొత్త కంటెంట్ చూసిన తర్వాత ఒక విషయం క్లియర్ గా తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఒక సినిమా, యూత్ కోసం మరో మూవీ, కంటెంట్ ప్రియుల కోసం ప్రత్యేకమైన చిత్రం, ఇంట్లో కూర్చుని నవ్వుకోవాలనుకునేవారికి ఓటీటీ సిరీస్ సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వీక్ లో వచ్చిన వాటిలో ఏ మూవీ ఎలా పెర్ఫామ్ చేస్తోంది? అన్నది ఓసారి చూద్దాం.
మా ఇంటి బంగారం
సమంత లీడ్ రోల్ లో తెరకెక్కిన మా ఇంటి బంగారం ఈ వీకెండ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు మంచి సెలెక్షన్ గా నిలుస్తోంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోతుంది. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ చిత్రంలో సమంత యాక్షన్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నారు. ఓ బేబీ తర్వాత నందినీ రెడ్డి- సామ్ కాంబినేషన్ పై ఏర్పడిన అంచనాలను సినిమా చాలావరకు అందుకుందని ప్రేక్షకుల అభిప్రాయం.
బాలన్
మలయాళ చిత్రం బాలన్ ది బాయ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఆ సర్వైవల్ థ్రిల్లర్ అందరికీ నచ్చకపోవచ్చు. అయితే స్టోరీ, ట్రీట్మెంట్ ను ఆస్వాదించే ప్రేక్షకులకు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. ముఖ్యంగా క్రిటిక్స్ నుంచి అత్యధిక ప్రశంసలు అందుకుంటున్న చిత్రం ఇదే కావడం విశేషం. కమర్షియల్ అంశాల కంటే కంటెంట్ కు ప్రాధాన్యం ఇచ్చే ప్రేక్షకులకు బెస్ట్ ఆప్షన్.
ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు
సీనియర్ హీరో వడ్డే నవీన్ రీఎంట్రీ మూవీ ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. సినిమా కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ దర్శకత్వం అవుట్ డేటెడ్ లో సాగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని పాత్రలు, కొన్ని ఎలివేషన్ సన్నివేశాలు ప్రస్తుత ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టుగా లేవని సినీ ప్రియులు చెబుతున్నారు. దీంతో మంచి ఆలోచన ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ చూపలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.
దీవాన
యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన దీవాన యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. ప్రేమ, ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఆ కథలో ఎమోషన్స్ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాయి. ప్రేమకథలను ఇష్టపడే యువతకు సినిమా కనెక్ట్ అవుతోందని టాక్. ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి చూడదగ్గ సినిమా అని ఇప్పటికే చూసినవారు అభిప్రాయపడుతున్నారు. గీతా ఆర్ట్స్ విడుదల చేయడంతో సినిమాకు మరింత గుర్తింపు వస్తోంది.
వంద దేవుళ్లు
విజయ్ ఆంటోనీ నటించిన వంద దేవుళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయ్ ఆంటోనీ సినిమాలంటే ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అయితే ఈసారి ఆ మ్యాజిక్ పనిచేయలేదని టాక్. సినిమా కంప్లీట్ గా నిరాశపరచకపోయినా, పెద్దగా ఆకట్టుకునే రేంజ్ కు చేరలేదని తెలుస్తోంది. మొత్తంగా సోసో అనిపించే చిత్రంగా నిలిచింది.
సేవ్ ది టైగర్స్ సీజన్ 3
ఓటీటీ ఆడియన్స్ కోసం సేవ్ ది టైగర్స్ సీజన్-3 మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. తొలి రెండు సీజన్లలాగానే మూడో సీజన్ కూడా నవ్వులు పంచుతోంది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ మరోసారి తమ కామెడీ టైమింగ్ తో అలరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఓటీటీ ఆప్షన్. ఏదేమైనా ఈ వీక్ లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం మా ఇంటి బంగారం, యూత్ కోసం దీవాన, కంటెంట్ లవర్స్ కోసం బాలన్, నవ్వుల కోసం సేవ్ ది టైగర్స్-3 ఉన్నాయని చెప్పాలి.
