ఈ వీక్ ఎంటర్టైన్మెంట్ ఫుల్.. థియేటర్స్‌లో జోష్, ఓటీటీలో థ్రిల్!
అటు థియేటర్లలో సమంత 'మా ఇంటి బంగారం'తో సందడి చేస్తుంటే, ఇటు ఓటీటీలో 'హౌస్ ఆఫ్ డ్రాగన్', 'దృశ్యం 3' వంటి సెన్సేషనల్ ప్రాజెక్టులు క్యూ కట్టాయి.
By: Madhu Reddy | 15 Jun 2026 3:20 PM ISTఈ వారం సినీ ప్రియులకు అసలైన పండగ మొదలుకాబోతోంది. అటు థియేటర్లలో సమంత 'మా ఇంటి బంగారం'తో సందడి చేస్తుంటే, ఇటు ఓటీటీలో 'హౌస్ ఆఫ్ డ్రాగన్', 'దృశ్యం 3' వంటి సెన్సేషనల్ ప్రాజెక్టులు క్యూ కట్టాయి. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని రకాల జోనర్లతో ఈ వీక్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ డోస్ గ్యారెంటీ..
థియేటర్లలో సమంత జోష్.. వడ్డే నవీన్ రీ-ఎంట్రీ:
ఈ వారం థియేటర్ల వద్ద సందడి గట్టిగానే ఉండబోతోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న విడుదలవుతోంది. యాక్షన్ మిళితమైన ఈ ఫ్యామిలీ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు, సీనియర్ హీరో వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమాతో చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక వీటితో పాటు ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడి కొత్త సినిమా ‘బాలన్: ది బాయ్’, యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘దీవాన’ కూడా ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఓటీటీలో మోస్ట్ అవేటెడ్ సిరీస్‌లు.. ‘హౌస్ ఆఫ్ డ్రాగన్’ వచ్చేస్తోంది:
ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3’ జూన్ 22 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. భారీ వార్ సీక్వెన్స్‌తో ఈ సీజన్ మొదలుకాబోతోంది. అలాగే ఇన్వెస్టిగేటివ్ కామెడీ ‘షుగర్ సీజన్ 2’ జూన్ 19 నుండి ఆపిల్ టీవీలో అందుబాటులోకి వస్తుంది. ఇక హైదరాబాద్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ‘మోటివ్ ఫర్ మర్డర్' జూన్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్‌లో ‘దృశ్యం 3’.. అదిరిపోయే అడల్ట్ థ్రిల్లర్స్:
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ సిరీస్ ‘దృశ్యం 3’ జూన్ 18న అమెజాన్ ప్రైమ్‌లోకి రాబోతోంది. సినిమా థియేటర్లలో మిస్ అయిన వారికి ఇది గొప్ప అవకాశం. అలాగే ‘యువర్ ఫాల్ట్ లండన్’ అనే అడల్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ జూన్ 17న స్ట్రీమ్ అవుతుంది. ఇక ఇద్దరు స్టెప్ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య నడిచే విభిన్నమైన ప్రేమకథగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్‌లో హ్యాపెనింగ్ కంటెంట్:
తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ‘సేవ్ ది టైగర్స్’ మూడో సీజన్ జూన్ 19 నుండి జియో హాట్‌స్టార్‌లో రాబోతోంది. భార్యాబాధిత భర్తల కష్టాలను ఈసారి ఇంకా సరదాగా చూపించబోతున్నారు. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో స్పెయిన్ రిసార్ట్ నేపథ్యంలో సాగే ‘ఒయాసిస్’ అనే థ్రిల్లర్, అలాగే తండ్రి-కొడుకుల అనుబంధాన్ని చాటిచెప్పే ‘కలర్ బుక్’ సినిమాలు జూన్ 19న రిలీజ్ అవుతున్నాయి. ఇవే కాకా టోవినో థామస్ నటించిన ‘అతిరథి’ సోనీ లివ్‌లో అలరించడానికి సిద్ధమైంది.
మొత్తానికి ఈ వారం థియేటర్లకు వెళ్లే వారికీ, ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో సినిమాలు చూసే వారికీ ఆప్షన్లు పుష్కలంగా ఉన్నాయి. సమంత యాక్షన్, దృశ్యం థ్రిల్, సేవ్ ది టైగర్స్ కామెడీ.. ఇలా అన్నీ ఒకే వారంలో రావడంతో సినీ ఫ్యాన్స్‌కు ఇదొక బిగ్ ట్రీట్ అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఫేవరెట్ సినిమాల లిస్ట్ ఇప్పుడే రెడీ చేసుకోండి..
