ఈ వారం రిలీజులివే!
మరో వారం వచ్చేసింది. ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 24 Nov 2025 7:00 PM ISTమరో వారం వచ్చేసింది. ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నవంబర్ ఆఖరి వారంలో పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కానుండగా, మరికొన్ని సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ వారం బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కానున్న సినిమాల్లో టాలీవుడ్ నుంచి క్రేజ్ ఉన్న సినిమా అయితే ఒకటే ఉంది. అదే ఆంధ్ర కింగ్ తాలూకా.
నవంబర్ 27న ఆంధ్ర కింగ్ తాలూకా
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ భారీ సక్సెస్ అందుకుంటుందని చిత్ర యూనిట్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది.
నవంబర్ 27న ధనుష్ అమర కావ్యం
ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ మూవీ తేరే ఇష్క్ మేన్. కృతి సనన్ హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ తెలుగులో అమర కావ్యం అనే టైటిల్ తో రిలీజవుతుంది. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ రెండు సినిమాలూ కాకుండా పులివెందుల మహేష్, షన్ను, సావిత్రి, సుమన్ ప్రధాన పాత్రల్లో పులివెందుల మహేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా స్కూల్ లైఫ్. నవంబర్ 28న స్కూల్ లైఫ్ మూవీ రిలీజవుతోంది. రాయ్ లక్ష్మీ, దీక్షా పంత్, అమన్ ప్రీత్ సింగ్, అనూప్ సోని, ప్రదీప్ రావత్ నటించిన జనతా బార్ మూవీ కూడా నవంబర్ 28వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరువ తరమా అనే మరో చిన్న సినిమా కూడా ఈ శుక్రవారమే రిలీజవుతోంది. వీటన్నింటితో పాటూ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మ్యాన్ మూవీ కూడా ఈ వారమే రీరిలీజవుతోంది. ఇవి కాకుండా ఓటీటీలో కూడా కొన్ని కొత్త సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ముందుగా..
నెట్‌ఫ్లిక్స్‌లో..
స్ట్రేంజర్ థింగ్స్ అనే వెబ్‌సిరీస్ సీజన్4
జింగిల్ బెల్ హైస్ట్ అనే హాలీవుడ్ మూవీ
ప్రైమ్ వీడియోలో..
బార్న్ వంగ్రీ అనే మూవీ
గుడ్ స్పోర్ట్స్ అనే వెబ్‌సిరీస్
