OTT: అఖండ వాయిదా.. మరి వీకెండ్ ప్లాన్ ఏంటి?
వీకెండ్ వస్తే చాలు.. చాలామంది మూవీ లవర్స్.. కచ్చితంగా సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.
By: M Prashanth | 5 Dec 2025 6:47 PM ISTవీకెండ్ వస్తే చాలు.. చాలామంది మూవీ లవర్స్.. కచ్చితంగా సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. అందుకు గాను ముందు నుంచి టికెట్లు కూడా బుక్ చేసుకుంటారు. అయితే ఈ వారం షెడ్యూల్ ప్రకారం బాలయ్య అఖండ 2 తాండవం మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తప్పని పరిస్థితుల్లో వాయిదా పడింది.
అఖండ మూవీకి వెళ్దామనుకున్న మూవీ లవర్స్ ఇప్పుడు నిరాశ పడక్కర్లేదు. థియేటర్స్ లో రెండు డబ్బింగ్ వెర్షన్లు రిలీజ్ అవ్వగా.. ఓటీటీలో పలు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మూవీ లవర్స్.. ఈ సారి వీకెండ్ ను వాటి చూసి ఎంజాయ్ చేయవచ్చు. మరి థియేటర్స్ లోకి వస్తున్న సినిమాలేంటి? ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవ్వనున్న చిత్రాలేంటి?
తెలుగులో అఖండ 2 తాండవం ప్రేక్షకుల ముందుకు వస్తుందనే కారణంతో మిగతా మేకర్స్ ఎవరూ తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయలేదు. అప్పటికే చేసుకున్న చిత్రాలు కూడా వాయిదా వేశారు. కాబట్టి ఒక్క టాలీవుడ్ మూవీ కూడా ఈ వారం రిలీజ్ అవ్వట్లేదు. అయితే బాలీవుడ్ మూవీ ధురంధర్, మలయాళం సినిమా కలాం కావల్ సినిమాలు విడుదలయ్యాయి.
బీ టౌన్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్ మూవీ.. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ గా రూపొందింది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరోవైపు, కొత్త దర్శకుడు జితిన్ కె. జోస్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ కలాం కావల్ విడుదలైంది.
అదే సమయంలో ఓటీటీలో పలు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో అందరి దృష్టి ది గర్ల్ ఫ్రెండ్ మూవీపై ఉంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా.. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు సహా వివిధ భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చింది. ఆ మూవీతోపాటు ఇంకేం కొత్తగా వచ్చాయంటే?
నెట్ ఫ్లిక్స్- స్టీఫెన్ (తమిళం)
జీ5- కేసరియా@100 (హిందీ డాక్యుమెంటరీ)
ఆహా- ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ (తమిళం, తెలుగు)
జీ5- ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు)
అమెజాన్ ప్రైమ్ వీడియో- జటాధర (తెలుగు)
సోనీ LIV- కుట్రం పురింధివన్- ది గిల్టీ వన్ (తమిళ వెబ్ సిరీస్)
జీ5- ఘర్వాలి పెడ్వాలి (తమిళం).. మరి మీరు వీకెండ్ లో ఏం చూస్తారు? ఏది సెలెక్ట్ చేసుకుంటారు?
