Begin typing your search above and press return to search.

తేజ సజ్జ హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్ తెలుగు’.. కంటెస్టెంట్స్ వీరే!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ తేజ సజ్జ సూపర్‌హీరో నుంచి సూపర్‌హోస్ట్‌గా మారిపోయారు.

By:  Madhu Reddy   |   6 Oct 2026 4:28 PM IST
తేజ సజ్జ హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్ తెలుగు’.. కంటెస్టెంట్స్ వీరే!
X

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ తేజ సజ్జ సూపర్‌హీరో నుంచి సూపర్‌హోస్ట్‌గా మారిపోయారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా రాబోతున్న మోస్ట్ అవైటెడ్ రియాలిటీ గేమ్ షో 'ది ట్రైటర్స్ తెలుగు' గ్రాండ్ లాంచ్ క్లిపింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అక్టోబర్ 15 నుంచి అఫీషియల్‌గా స్ట్రీమింగ్ కానున్న ఈ షోపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. నమ్మకం, మోసాలు, వ్యూహాలతో సాగే ఈ సరికొత్త గేమ్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

తేజ సజ్జ గ్రాండ్ ఎంట్రీ అండ్ హోస్టింగ్:

హిందీలో కరణ్ జోహార్ హోస్ట్ చేసి సూపర్ హిట్ చేసిన ఈ ఇంటర్నేషనల్ ఫార్మాట్‌ను ఇప్పుడు తెలుగులో అట్టహాసంగా తీసుకువస్తున్నారు. తాజాగా విడుదలైన లాంచ్ వీడియోలో తేజ సజ్జ స్టైలిష్ ఎంట్రీ ఇస్తూ అందరికీ అదిరిపోయే వెల్కమ్ చెప్పారు. ఒక సినిమాకు తీసుకునే రేంజ్‌లో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ తేజ ఈ షో ద్వారా హోస్ట్‌గా తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. ఆయన హోస్టింగ్ స్టైల్ ఈ షోకి మెయిన్ హైలైట్‌‌గా నిలవనుంది.

20 మందితో పవర్‌ఫుల్ కంటెస్టెంట్స్ లిస్ట్:

ఈ షోలో పాల్గొనే 20 మంది కంటెస్టెంట్స్ పేర్లను మేకర్స్ అధికారికంగా రివీల్ చేశారు. సింగర్ చిన్మయి, నటుడు హర్షవర్ధన్, ప్రగతి, శ్రీవిజయ్ సింహ, విలక్షణ నటి విద్యుతేల రామన్‌తో పాటు మనీషా చౌదరి, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, గ్లేమర్ కంటెంట్ క్రియేటర్లు ఈ షోలో బరిలో దిగుతున్నారు. విభిన్న రంగాలకు చెందిన వీరంతా ఒకే వేదికపై రచ్చ చేయడం పక్కా..

నమ్మకం వర్సెస్ మోసం గేమ్:

ఈ గేమ్ పూర్తిగా మైండ్ గేమ్‌పై నడుస్తుంది. కంటెస్టెంట్స్‌ను 'ఫెయిత్‌ఫుల్స్', 'ట్రైటర్స్' అని రెండు భాగాలుగా విభజిస్తారు. ట్రైటర్స్ ఎవరనేది ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా అందరిని ఎలిమినేట్ చేస్తుంటారు. ఇక ఆ ట్రైటర్స్ ఎవరో కనిపెట్టడానికి ఇన్నోసెంట్స్ చేసే ప్రయత్నాలు, మధ్యలో జరిగే మైండ్ గేమ్‌లు, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను కట్టపడేయడం ఖాయం.

మొత్తానికి, ఒక సినిమా రేంజ్ మేకింగ్‌తో వస్తున్న 'ది ట్రైటర్స్ తెలుగు' అక్టోబర్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టనుంది. వైరల్ అవుతున్న లాంచ్ వీడియో చూశాక ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మరి తేజ సజ్జ హోస్టింగ్‌లో ఈ మైండ్ గేమ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఫ్యాన్స్ అయితే ఈ సరికొత్త రియాలిటీ షో కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.