ఆ రెడ్ బ్యాగ్ లో ఏముంది.. పీవీఆర్ ఐనాక్స్ రంగంలోకి దిగిందిగా!
చిన్న సినిమాలకు ఎంత మంచి కంటెంట్ ఉన్నా జనం దాకా వెళ్లాలంటే సరైన రిలీజ్ పార్టనర్ దొరకాలి. ఇప్పుడు ది రెడ్ బ్యాగ్ టీమ్ కు సరిగ్గా ఇలాంటి ప్లస్ పాయింట్ దొరికింది.
By: M Prashanth | 16 Aug 2026 12:27 PM ISTచిన్న సినిమాలకు ఎంత మంచి కంటెంట్ ఉన్నా జనం దాకా వెళ్లాలంటే సరైన రిలీజ్ పార్టనర్ దొరకాలి. ఇప్పుడు ది రెడ్ బ్యాగ్ టీమ్ కు సరిగ్గా ఇలాంటి ప్లస్ పాయింట్ దొరికింది. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ లాంటి పెద్ద సంస్థ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ముందుకు రావడం నిజంగా స్పెషల్. ఆగస్టు 21న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. మంచి బజ్ ఉన్న ఈ ప్రాజెక్ట్ కు ఇప్పుడు పెద్ద బ్యాకప్ దొరకడంతో ప్రమోషన్స్ కు గట్టి బేస్ పడింది.
ది రెడ్ బ్యాగ్ అనే టైటిల్ వినగానే అందులో ఏదో పెద్ద మిస్టరీ ఉందనే ఫీల్ కలుగుతోంది. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తే అదే విషయం క్లియర్ గా అర్థమవుతోంది. ముగ్గురు అమ్మాయిలు చేతిలో గన్స్ పట్టుకుని సీరియస్ గా ఉండటం, వాళ్ల మధ్యలో ఆ ఎర్రటి బ్యాగ్ ను హైలైట్ చేయడం సినిమా మీద క్యూరియాసిటీని పెంచుతోంది. అసలు ఆ బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయా, లేక ఏదైనా క్రైమ్ కు సంబంధించిన సీక్రెట్ ఉందా అనేది మేకర్స్ ఇంకా సస్పెన్స్ గానే ఉంచారు.
రవి కుమార్ సీరపు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాస్టింగ్ కూడా గట్టిగానే సెట్ చేశారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనికా, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఇషాన్ శంకర్ లాంటి వాళ్లు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇంతమంది యాక్టర్స్ ఉన్నా కథలో ఎవరు ఏ వైపు ఉంటారు అనే క్లారిటీ మాత్రం టీమ్ ఇవ్వలేదు. పోస్టర్స్ లో వాళ్లు కనిపిస్తున్న తీరు చూస్తే మాత్రం, ప్రతి క్యారెక్టర్ కు ఆ రెడ్ బ్యాగ్ తో ఏదో ఒక బలమైన కనెక్షన్ ఉందనే ఫీల్ వస్తోంది.
మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ప్రియేష్ గురుస్వామి కెమెరా వర్క్, శేఖర్ మోపూరి మ్యూజిక్ సినిమాకు మెయిన్. శివ శర్వాణి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన టీజర్ చూస్తే ఇదొక డార్క్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ను గట్టిగానే మిక్స్ చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు.
ఇప్పుడు అసలు పరీక్ష ఆగస్టు 21న థియేటర్లలో జరగబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ లాంటి సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం వల్ల స్క్రీన్స్ పరంగా మల్టీప్లెక్స్ లలో మంచి రీచ్ దొరికే అవకాశం ఉంటుంది. అయితే ఎన్ని థియేటర్లు దొరికాయి అన్నదాని కంటే, ఆ రెడ్ బ్యాగ్ వెనకున్న కథ జనాలను ఎంతవరకు థ్రిల్ చేసింది అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. కంటెంట్ లో స్టఫ్ ఉంటే ఇలాంటి థ్రిల్లర్స్ కు కలెక్షన్స్ ఆటోమేటిక్ గా వస్తాయి.
ఇప్పటికైతే టీమ్ ఆ రెడ్ బ్యాగ్ మిస్టరీని రివీల్ చేయకుండా దాచిపెట్టడంలో వంద శాతం సక్సెస్ అయింది. రిలీజ్ వరకు కూడా ఆడియన్స్ లో ఇదే క్యూరియాసిటీని కంటిన్యూ చేస్తే మాత్రం ఓపెనింగ్స్ కు ఢోకా ఉండదు. ఒక చిన్న సినిమా పెద్ద డిస్ట్రిబ్యూషన్ తో వస్తుండటం మేకర్స్ కు కూడా ఒక మంచి పరిణామమే. మరి ఆ ఎర్ర బ్యాగ్ లో ఉన్న అసలు రహస్యం ఏంటో తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.
