Begin typing your search above and press return to search.

'ది రెడ్ బ్యాగ్' నుంచి 'నీ వెనకే'.. మనసు దోచేస్తుందిగా!

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో మంచి మ్యూజిక్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మరోసారి గుర్తు చేస్తోంది ది రెడ్ బ్యాగ్ మూవీ టీమ్.

By:  M Prashanth   |   4 Aug 2026 12:01 AM IST
ది రెడ్ బ్యాగ్ నుంచి నీ వెనకే.. మనసు దోచేస్తుందిగా!
X

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో మంచి మ్యూజిక్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మరోసారి గుర్తు చేస్తోంది ది రెడ్ బ్యాగ్ మూవీ టీమ్. ఇప్పటికే టీజర్, గ్లింప్స్‌ తో ఇంట్రెస్ట్ పెంచిన ఆ సినిమా.. ఇప్పుడు వరుస పాటలతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా విడుదలైన నీ వెనకే మెలోడీ సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది.

మెమరీ మేకర్స్ బ్యానర్‌ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న ఆ చిత్రానికి రవికుమార్ సీరపు దర్శకత్వం వహిస్తున్నారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇటీవల విడుదలైన డిస్కో లైట్ పాట యూట్యూబ్‌ లో మంచి రెస్పాన్స్ పొందింది. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన మూడ్‌ లో వచ్చిన నీ వెనకే పాట ప్రేక్షకులను అలరిస్తోంది.

ఆ పాటకు స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోశారు. లవ్ ఎమోషన్స్ ను ఎంతో క్లీన్ గా ఎక్స్ప్రైస్ చేసే ఆయన గానం సాంగ్ కు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. సిద్ శ్రీరామ్ వాయిస్ లోని స్వీట్ నెస్, ఎక్స్ప్రెషన్స్ సాంగ్ ను మరింత అట్రాక్టివ్ గా మార్చాయి. మెలోడీని ఇష్టపడే వారికి పాట తప్పకుండా నచ్చేలా రూపొందిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఆ సాంగ్ కు తిరుపతి జావన సాహిత్యం అందించారు. ఈజీ వర్డ్స్ తో లవ్ లోని ఎక్స్పీరియన్స్ లను వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు సంగీత దర్శకుడు శేఖర్ మోపురి స్వరపరిచిన బాణీ కూల్ ఫీల్‌ ను కలిగిస్తోంది. వినడానికి హాయిగా ఉండే ఆ ట్యూన్ పాట పూర్తయ్యాక మనసులో నిలిచిపోయేలా ఉందని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు.

హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీతో పాటు విజువల్స్ కూడా మెలోడీకి తగ్గట్టుగా అందంగా కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ ప్రియేష్ గురుస్వామి అందించిన విజువల్స్ పాట అందాన్ని పెంచాయి. ఎడిటింగ్ కూడా పాటకు తగ్గట్టుగా సాఫీగా సాగడంతో మొత్తం సాంగ్‌ కు మంచి ఫ్లో వచ్చింది. ఇప్పటికే విడుదలైన డిస్కో లైట్ పాటకు పూర్తి భిన్నంగా నీ వెనకే మెలోడీని విడుదల చేయడం ద్వారా సినిమాలో సంగీతానికి వైవిధ్యం ఉంటుందనే మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

వరుసగా వస్తున్న పాటలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ తో సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్నాయి. దీంతో మూవీపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. అయితే మెమరీ మేకర్స్ నిర్మిస్తున్న ది రెడ్ బ్యాగ్ సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే సంగీతంతో ఆకట్టుకుంటున్న ఆ సినిమా, కథతో కూడా అదే రేంజ్ లో మెప్పిస్తుందా అన్న ఆసక్తి సినీ ప్రియుల్లో నెలకొంది. ప్రస్తుతం నీ వెనకే పాట మాత్రం మెలోడీ లవర్స్ ప్లేలిస్టుల్లో స్థానం సంపాదించుకుంటూ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.