రెడ్ బ్యాగ్ లో అసలు ఏముంది? ఆసక్తిని పెంచుతున్న డైరెక్టర్ ఆన్సర్
మెమరీ మేకర్స్ బ్యానర్ లో హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న సినిమా ది రెడ్ బ్యాగ్. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు.
By: Sravani Lakshmi Srungarapu | 1 Aug 2026 3:58 PM ISTమెమరీ మేకర్స్ బ్యానర్ లో హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న సినిమా ది రెడ్ బ్యాగ్. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే రీసెంట్ గా మూవీ యూనిట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. ఈ సినిమా టీజర్ తర్వాత ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రధాన ప్రశ్న ఆ రెడ్ బ్యాగ్‌లో ఏముంది? అన్నదే. ఈ ప్రశ్నకు డైరెక్టర్ రవి కుమార్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. బ్యాగ్‌లో క్యాష్, డైమండ్స్, డ్రగ్స్, హవాలా డబ్బు లేదా బంగారం ఏమీ ఉండదని, అదే సినిమాకు సంబంధించిన పెద్ద హింట్ అని చెప్పారు. టీజర్ చూసిన కొందరు దీనికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లేదా రెడ్ బుక్ తో సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారని, కానీ అలాంటి సంబంధం ఏమాత్రం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
సినిమా చూసిన తర్వాత ఎవరూ డిజప్పాయింట్ అవరని, కథలోని కంటెంట్ ఆడియన్స్ ను పూర్తిగా శాటిస్‌ఫై చేస్తుందని డైరెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. టీజర్ లాంచ్‌లో తాను ఈ సినిమా కోసం 16 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని చెప్పిన ఆయన, ఆ జర్నీని మాత్రం ఎప్పుడూ కష్టంగా కాకుండా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఎక్స్‌పీరియెన్స్ చేశానన్నారు. 2010లో సీరియల్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభమైన తన కెరీర్, తర్వాత సినిమాల వరకు చాలా సాఫీగా సాగిందని చెప్పారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రాజ్య, కన్నడ నటి అయినప్పటికీ కేవలం 31 రోజుల్లో తెలుగు నేర్చుకున్నానని చెప్పడం విశేషం. మంచి కథ, బలమైన పాత్రతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాలనుకున్నానని, రెడ్ బ్యాగ్ స్క్రిప్ట్ విన్న తర్వాత ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తాయని భావించి ఈ సినిమా ఒప్పుకున్నానని తెలిపింది. యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ కోసం వర్క్‌షాప్స్‌లో పాల్గొన్నానని, ఒక రివర్స్ స్టంట్ సీన్ మాత్రం చాలా కష్టంగా అనిపించిందని చెప్పింది.
మరో హీరోయిన్ మౌనిక తన పాత్ర నెగిటివ్ లేదా పాజిటివ్ అనే విషయాన్ని చెప్పకుండా, తన క్యారెక్టర్ ఏదైనా ఆడియన్స్ మాత్రం తన క్యారెక్టర్ తో స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతారని చెప్పింది. అమ్మాయిల గురించి సమాజంలో ఉన్న కొన్ని అభిప్రాయాలను ఈ సినిమా ప్రశ్నిస్తుందని, సినిమా చూసిన తర్వాత చాలా మందిలో ఆలోచన మారుతుందని ఆమె అభిప్రాయపడింది.
నలుగురు కొత్త హీరోయిన్లను సెలెక్ట్ చేయడంపై రవి కుమార్ మాట్లాడుతూ, భారీగా ఆడిషన్లు నిర్వహించామని, పెర్ఫార్మెన్స్, యాక్షన్‌పై ఇంట్రెస్ట్, ఫిట్‌నెస్ వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఫైనల్ సెలెక్షన్ చేశామని తెలిపారు. తెలిసిన ఫేస్ ను తీసుకుంటే ప్రమోషన్స్‌కు ఉపయోగపడుతుందని భావించినా, నిర్మాత హరికృష్ణ మాత్రం కంటెంట్‌పైనే నమ్మకం ఉంచి రాజీ పడలేదన్నారు. మొదట అనుకున్న బడ్జెట్‌ను కథ విన్న తర్వాత నాలుగు రెట్లు పెంచడంతో సినిమాను మరింత క్వాలిటీతో తీయగలిగామని వెల్లడించారు.
సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ కథ పుట్టిందని, నిర్మాత ఆలోచనను ప్రస్తుత తరం ప్రేక్షకులకు చేరేలా మలచడం తన పని అని రవి కుమార్ చెప్పారు. కబీర్ సింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కొత్త కోణంలో కనిపిస్తారని, నాలుగు పాటలు, ముఖ్యంగా ఒక ఎమోషనల్ సాంగ్ ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంటుందని వెల్లడించారు. మొత్తానికి, ది రెడ్ బ్యాగ్ ఒక మిస్టరీ అంశంతో పాటు స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ను కూడా అందించబోతుందనే సంకేతాలు ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా కనిపించాయి.
