ఆ రెండు పెద్ద సినిమాల ముందు ఓటీటీ పరీక్ష
ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లోని రెండు భారీ సినిమాలకు సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా పూర్తి అవకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
By: Sravani Lakshmi Srungarapu | 1 Oct 2025 11:00 PM ISTసోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఓటీటీలు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కోవిడ్ కు ముందు టాలీవుడ్ లో పెద్దగా ఓటీటీ కల్చర్ లేదు. కానీ కోవిడ్ తర్వాత ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. థియేటర్లలో చూసిన సినిమాలను సైతం ఓటీటీల్లో మళ్లీ మళ్లీ చూస్తున్నారు ఆడియన్స్. అందుకే వాటికి డిమాండ్ బాగా ఎక్కువైపోయింది.
ఈ నేపథ్యంలో ప్రతీ చిత్ర నిర్మాత రిలీజ్ కు చాలా ముందుగానే తమ సినిమా ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంటున్నారు. కొన్ని సినిమాలైతే కనీసం షూటింగ్ కూడా పూర్తవకుండానే ఓటీటీ డీల్స్ ను పూర్తి చేసుకుంటున్నాయి. ఇలా చేయడం వల్ల నిర్మాతలకు డిజిటల్ రైట్స్ రూపంలోనే తాము పెట్టిన బడ్జెట్ లో చాలా వరకు తిరిగి పొందే అవకాశం లభిస్తుంది.
ఇంకా పూర్తవని ఓటీటీ డీల్
ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లోని రెండు భారీ సినిమాలకు సంబంధించిన ఓటీటీ డీల్ ఇంకా పూర్తి అవకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ సినిమాలు మరేవో కావు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తోన్న ది రాజా సాబ్ మరియు వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రానున్న విశ్వంభర.
ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఓటీటీ డీల్స్ ఇంకా పూర్తి కాలేదు. విశ్వంభర సినిమాను నెక్ట్స్ ఇయర్ కు పోస్ట్‌పోన్ చేయడంతో వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తయ్యాక ఈ సినిమా డిజిటల్ డీల్ ను క్లోజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక రాజా సాబ్ విషయానికొస్తే ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ఇది కూడా ఒక రీజన్ అని తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజైన రాజా సాబ్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటూ ట్రైలర్ లోని విజువల్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ట్రైలర్ రిలీజయ్యాక రాజా సాబ్ పై అంచనాలు మరింత పెరిగాయి. అంచనాలు పెరగడంతో వీలైనంత త్వరగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్ ను క్లోజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఈ రెండు సినిమాలూ ఓటీటీ డీల్స్ తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.
