Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'రాజాసాబ్'.. విశ్వప్రసాద్, తమన్ అదిరే అప్డేట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో రూపొందుతున్న ది రాజా సాబ్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   17 Dec 2025 11:06 PM IST
ప్రభాస్ రాజాసాబ్.. విశ్వప్రసాద్, తమన్ అదిరే అప్డేట్స్..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో రూపొందుతున్న ది రాజా సాబ్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా.. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. 2026 జనవరి 9న రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్ కూడా చేపడుతున్నారు. తాజాగా రెండో సాంగ్ ను విడుదల చేశారు. హైదరాబాద్ లోని లూలూ మాల్ లో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ కు మూవీ టీమ్ అటెండ్ అవ్వగా.. విశ్వప్రసాద్, తమన్ అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు.

రాజా సాబ్ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని ప్రకటించారు. సినిమా రిలీజ్ కు ముందు రోజు అంటే జనవరి 8వ తేదీన.. అంతా కోరుకుంటున్నట్లు ప్రీమియర్స్ షోస్ వేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలో ప్రీమియర్స్ ఉండవని సర్కార్ ప్రకటించగా.. ఇప్పుడు నిర్మాత మాత్రం షోస్ ఉంటాయని అనౌన్స్ చేయడం గమనార్హం.

అదే సమయంలో ఈవెంట్‌ లో మరో అప్డేట్ కూడా ఇచ్చారు విశ్వప్రసాద్. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌ లోనే నిర్వహిస్తామని తెలిపారు. ఓపెన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్నామని, చాలా రోజుల తర్వాత ప్రభాస్ ను ఆ ఈవెంట్ ను లో చూడనున్నారని అన్నారు. దీంతో ఆ ఈవెంట్ కు డార్లింగ్ వస్తుండడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు కచ్చితంగా వస్తారు.

మరోవైపు.. సినిమా నుంచి నెక్స్ట్ రాబోయే రెండు పాటలు కూడా ఎగ్జైటింగ్ గా ఉండనున్నాయని తమన్ తెలిపారు. లాస్ట్ సాంగ్ లో ప్రభాస్ మామూలుగా డ్యాన్స్ వేయలేదని చెప్పి అంచనాలు పెంచారు. ముగ్గురు హీరోయిన్లతో ఉండే సాంగ్ లో డార్లింగ్ దుమ్ముదులిపేశారని తమన్ వెల్లడించారు. సాంగ్ డిలే అవ్వొచ్చని, కానీ మూవీ మాత్రం ఆన్ టైమ్ అంటూ హామీ ఇచ్చారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రభాస్ విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఆయన సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బొమన్ ఇరాని, బ్రహ్మానందం, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏదేమైనా రాజా సాబ్ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.