ది రాజాసాబ్ స్టోరీ రివీల్ చేసిన ప్రొడ్యూసర్..
ఈ సందర్భంగా ది రాజాసాబ్ సినిమా స్టోరీ రివీల్ చేశారు నిర్మాత. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. "ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ బాహుబలి సినిమాలకు ముందు ఎలా అయితే నటించారో అలా కనిపించబోతున్నారు.
By: Madhu Reddy | 5 Jan 2026 10:50 PM ISTప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ది రాజాసాబ్. ప్రభాస్ కెరియర్ లో తొలిసారి నటించబోతున్న హారర్ కామెడీ మూవీ ఇది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాదు ప్రముఖ మలయాళ నటి మాళవిక మోహనన్ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. సంజయ్ దత్, బోమన్ ఇరానీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి "నాచే నాచే" అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం.
ఈ ప్రెస్ మీట్ లో ముగ్గురు హీరోయిన్స్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ , నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పాల్గొని పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ది రాజాసాబ్ సినిమా స్టోరీ రివీల్ చేశారు నిర్మాత. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. "ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ బాహుబలి సినిమాలకు ముందు ఎలా అయితే నటించారో అలా కనిపించబోతున్నారు. అలాగే సెకండ్ భాగంలో హారర్ బ్యాక్ డ్రాప్ లో కనిపించబోతున్నారు. ముఖ్యంగా మొదటి భాగం కామెడీతో కొనసాగితే.. రెండవ భాగం హారర్ బ్యాక్ డ్రాప్లో ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది" అంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు.
ముఖ్యంగా ఇందులో ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా నటించారు అని.. ది రాజాసాబ్ సినిమా సెకండ్ భాగంలో కొత్త ప్రభాస్ ని చూస్తారు అని ఆయన తెలిపారు. మొత్తానికైతే ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే ఆలోచనలకు.. స్టోరీ గురించి హింట్ ఇస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ప్రభాస్ బాహుబలి సినిమాకి ముందు నటించిన సినిమాలలో ఎలా ఉండేవారో అలా ఈ సినిమా మొదటి భాగంలో కనిపిస్తారని చెప్పి ఆడియన్స్ లో మరింత అంచనాల పెంచేశారు నిర్మాత. మరి జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ కి ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.
ప్రభాస్ విషయానికి వస్తే.. బాహుబలి సినిమా తర్వాత అన్నీ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన.. ఇప్పుడు తొలిసారి హారర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే గతంలో కల్కి 2898 ఏడి సినిమాతో సంచలనం సృష్టించిన ప్రభాస్.. ఈ సినిమా సీక్వెల్లో కూడా నటించనున్నారు. అలాగే సలార్ 2 సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తారు ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరింత పాపులారిటీ అందుకుంటున్నారు.
